భారత రాజ్యాంగం - చట్టాలు


భారత రాజ్యాంగం  - చట్టాలు



- 1వ సవరణ చట్టం (1951) : స్వేచ్ఛ, సమానత్వం, ఆస్తిహక్కుపై నియంత్రణ, భూ సంస్కరణలకు సంబంధించిన అంవాలు తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు.
- 2వ సంవరణ చట్టం 1952) : ఆర్టికల్‌ 81ని సవరించి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రాల ప్రాతినిధ్య పరిమితులను పునర్‌ సర్ధుబాటు చేశారు.
- 3వ సవరణ చట్టం (1954) : ముడి పత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తి, పశువులకు సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
- 8వ సవరణ చట్టం (1960) : ఎస్సీ, ఎస్టీలు ఆంగ్లో ఇండియన్లకు కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు కొనసాగించడానికి వీలుగా ఈ సవరణ తీసుకొచ్చారు.
- 17వ సవరణ చట్టం (1964) : రాష్ట్రాల న్యాయ సమీక్షాధికారాన్ని పునర్నిర్వచించారు.
- 23వ సవరణ చట్టం (1969) : చట్ట సభల్లో షెడ్యుల్డ్‌ కులాలు, తెగలకు, ఆంగ్లో ఇండియన్స్‌కు అమలవుతున్న రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు కొనసాగించడానికి వీలుగా ఆర్టికల్‌ 334ను సవరించారు.
- 26వ సవరణ చట్టం (1971) : రాజభరణాలు రద్దు చేశారు.
- 32వ సవరణ చట్టం (1973) : తెలంగాణకు చెందిన ఆరు సూత్రాల పథకాన్ని చేర్చారు.
- 34వ సవరణ చట్టం : తొమ్మిదో షెడ్యూల్‌ అధికార పరిధి పెంచారు.
- 42వ సవరణ చట్టం (1976): ప్రవేశికలో సామ్యవాదం, లౌకిక అనే పదాలను చేర్చారు. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు. హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. లోక్‌సభ, శాసన సభ సభ్యుల పదవీ కాలాన్ని ఆరేళ్లకు పెంచారు.
- 44వ సవరణ చట్టం (1978) : ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. లోక్‌సభ, శాసనసభ సభ్యుల పదవీ కాలాన్ని తిరిగి ఐదేళ్లకు తగ్గించారు.
- 52వ సవరణ చట్టం (1985) : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేశారు.
- 61వ సవరణ చట్టం (1990) : వయోజన ఓటు హక్కు వయోపరిమితిని 21 నుంచి 18కి తగ్గించారు.
- 71వ సవరణ చట్టం (1990) : నేపాలీ, మణిపూరీ, కొంకణీ భాషలను ఎనిమిదో షెడ్యూల్‌కు చేర్చారు.
- 73వ సవరణ చట్టం (1993) : గ్రామపంచాయతీ పాలనకు సంబంధించి (9ఎ) కింద అనేక అంశాలు చేర్చారు.
- 74వ సవరణ చట్టం (1993) : మున్సిపాలిటీలకు సంబంధించి (9ఎ) కింద అనేక అంశాలను చేర్చారు.
- 86వ సవరణ చట్టం (2001) : 6-14 సంవత్సరాల లోపు బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. 21ఎ ఆర్టికల్‌ను కొత్తగా చేర్చారు.
- 108 వ సవరణ చట్టం (2010) : చట్ట సభల్లో మహిళలకు 1/3 స్థానాలు రిజర్వ్‌ చేయడం కోసం ప్రతిపాదించారు.
- 110వ సవరణ బిల్లు (2009) : 243డి ప్రకారం ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో 1/3 వంతు సీట్లను మహిళలకు కేటాయించారు. 112వ సవరణ బిల్లు (2009) మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లను కేటాయించాలని ప్రతిపాదించిన బిల్లు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment