రాజ్యాంగం - రాష్ట్రాలు - అధికారాలు


1.    భారత రాజ్యాంగంలోని మొదటిభాగంలో 1 నుంచి 4 వరకు ఉన్న అధికరణాలు వేటిని వివరిస్తాయి?
    ఎ) పౌరసత్వం         బి) కేంద్రపాలిత ప్రాంతాలు      సి) రాషా్ట్రలు         డి) భారత రాజ్యాంగ చరిత్ర


2.    దాద్రానగర్‌ హవేలీ  ఏ యూరోపియన్‌ పాలకుల నుంచి స్వాతంత్రయం పొందింది?
    ఎ) పోర్చుగీసు  బి) డచ్‌  సి) ఆంగ్లేయులు  డి) ఫ్రెంచి


3.    కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీకి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
    ఎ) 1954లో దాద్రానగర్‌ హవేలీ స్వాతంత్రం పొందింది
    బి) 1961 వరకు  ప్రజలు ఎన్నుకున్న నాయకుడితో పరిపాలన కొనసాగింది.
    సి) 10వ ‘భారత రాజ్యాంగ సవరణ చట్టం (1961) ’ ద్వారా దాద్రానగర్‌ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు
    డి) పైవన్నీ సరైనవే


4.    పోలీసు చర్య(1961) ద్వారా భారతదేశంలో విలీనమైన కేంద్రపాలిత ప్రాంతం ఏది?
    ఎ) లక్షదీవులు      బి) అండమాన్‌, నికోబార్‌ దీవులు     సి) డామన్‌, డయ్యు  డి) పాండిచ్చేరి


5.    ప్రస్తుతం గోవా రాషా్ట్రనికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
    ఎ) పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న గోవా ప్రాంతాన్ని 1961లో పోలీసు చర్య ద్వారా భారతదేశం స్వాధీనం చేసుకొంది.
    బి) భారత రాజ్యాంగ సవరణ చట్టం 1962 ప్రకారం గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు
    సి) 1987లో గోవాకు రాష్ట్రస్థాయి హోదా కల్పించారు
    డి) పైవన్నీ సరైనవే


6.    బొంబాయి రాషా్ట్రన్ని విడదీసి మహారాష్ట్ర, గుజరాత్‌ రాషా్ట్రలుగా మార్చిన సంవత్సరం ఏది?
    ఎ) 1959    2) 1960    సి) 1961    డి) 1962


7.    భారతదేశంలో గుజరాత్‌ ఎన్నో రాష్ట్రంగా అవతరించింది?
    ఎ) 14వ రాష్ట్రం          బి) 13వ రాష్ట్రం      సి) 15వ రాష్ట్రం          డి) 11వ రాష్ట్రం


8.    గోవా, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యులకు ఉన్న సాధారణ లక్షణం ఏమిటి?
    ఎ) ఈ ప్రాంతాలన్నీ ఒకనాటి పోర్చుగీసు వలస ప్రాంతాలు
    బి) పైన పేర్కొన్న రాషా్ట్రలు భారతదేశంలో పశ్చిమ దిశలో ఉన్నాయి    
    సి) ఎ, బి రెండూ సరైన సమాధానాలు కావు
    డి) ఎ, బి రెండూ సరైన సమాధానాలు


9.    పుదుచ్చేరి ఏ యురోపియన్‌ పాలకుల  వలస ప్రాంతం?
    ఎ) ఫ్రెంచి  బి) డచ్చి  సి) ఆంగ్లేయులు  డి) పోర్చుగీసు


10.    అత్యధిక రాషా్ట్రల భూభాగాలతో సరిహద్దును కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది?
    ఎ) గోవా              బి) పాండిచ్చేరి     సి) దాద్రానగర్‌ హవేలి      డి) చండీఘడ్‌


11.    పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఏ రాషా్ట్రలతో  సరిహద్దులను కలిగి ఉంది?
    ఎ) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌      బి) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక   
     సి) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ      డి) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ


12.    పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
    ఎ) 1954 సంవత్సరంలో  పుదుచ్చేరిని ఫ్రాన్స్‌, భారతదేశానికి స్వాధీనం చేసింది.
    బి) 1962లో పాండిచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.
    సి) 14వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని భారత రాజ్యాంగం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది
    డి) పైవన్నీ సరైన సమాధానాలు


13.    నాగాలాండ్‌ను 1963లో 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. నాగాలాండ్‌ రాష్ట్ర అధికార భాష ఏది?
    ఎ) నాగా      బి) అస్సామీ సి) ఆంగ్లం       డి) హిందీ


14.     రెఫరెండం ద్వారా భారత దేశంలో విలీనమైన రాష్ట్రం ఏది?
    ఎ) సిక్కిం      బి) నాగాలాండ్‌     సి) మణిపూర్‌      డి) త్రిపుర


15.     1987లో రాషా్ట్రలుగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?
    ఎ) మణిపూర్‌, త్రిపుర, మేఘాలయత     బి) మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా  
    సి) సిక్కిం, నాగాలాండ్‌, గోవా    డి) గోవా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం


16.    గోవా నుంచి విడదీసిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?
    ఎ) దాద్రానగర్‌, హవేలీ     బి) లక్షదీవులు      సి) డయ్యు, డామన్‌      డి) పైవేవీ కావు


17.    కిందివాటిలో శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
    ఎ) అండమాన్‌          బి) చండీఘడ్‌     సి) డామన్‌, డయ్యు      డి) పాండిచ్చేరి


18.    మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా ఎప్పుడు మార్చారు?
    ఎ) 1969    బి) 1956    సి) 1968    డి) 1973


19.    మైసూర్‌ రాష్ట్రం పేరును కర్ణాటకగా ఎప్పుడు మార్చారు?
    ఎ) 1969    బి) 1970    సి) 1975    డి) 1973


20.    లక్షదీవులకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
    ఎ) లక్కదీవి, మినికాయ్‌, అమిని దీవులు లక్షదీవుల్లో భాగం
    బి) లక్కదీవి, మినికాయ్‌, అమిని దీవులను కలిపి 1973 నుంచి లక్షదీవులుగా పేరు మార్చారు
    సి) ఎ, బి రెండూ సరైన సమాధానాలు కావు
    డి) ఎ, బి రెండూ సరైన సమాధానాలు


21.    ఢిల్లీకి జాతీయ రాజధాని భూభాగ హోదా స్థాయిని   ఎప్పుడు ప్రకటించారు?
    ఎ) 1990    బి) 1991    సి) 1992    డి) 1993


22.     ఢిల్లీకి జాతీయ రాజధాని భూభాగ హోదా స్థాయిని ఎన్నో భారత రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు?
    ఎ) 66      బి) 67      సి) 69      డి) 68


23.     1950లో భారతదేశంలోని రాషా్ట్రలకు సంబంధించి సరైన సమాధానం ఏది?
    ఎ) భారతదేశంలోని రాషా్ట్రలను ఎ,బి,సి,డి రాషా్ట్రలుగా విభజించారు
    బి) పార్ట్‌-డి అండమాన్‌, నికోబర్‌ దీవులను మాత్రమే రాష్ట్రంగా పేర్కొన్నారు
    సి) ఎ, బి రెండూ సరైన సమాధానాలు కాదు
    డి) ఎ, బి రెండూ సరైన సమాధానాలు


24.    భాషా ప్రయుక్త రాషా్ట్రల ఏర్పాటు చట్టం(1956) ద్వారా మనదేశంలో ఎన్ని రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు?
    ఎ) 14 రాషా్ట్రలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు      
     బి) 16 రాషా్ట్రలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు      
     సి) 20 రాషా్ట్రలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు     
     డి) 28 రాషా్ట్రలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు


25.    భారత రాజ్యాంగంలోని 8వ భాగంలోని 239 నుంచి 241 వరకు ఉన్న అధికరణాలు వేటిని వివరిస్తాయి?
    ఎ) రాషా్ట్రలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి
    బి) కేవలం రాషా్ట్రల పేర్ల గురించి మాత్రమే వివరిస్తాయి
    సి) కేవలం కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాత్రమే
    డి) పైవేవీ కావు


26.    పుదుచ్చేరిలో ఏ సంవత్సరంలో శాసనసభను ఏర్పాటు చేశారు?
    ఎ) 1962    బి) 1963    సి) 1992    డి) 1996


27.    ఢిల్లీకి శాసనసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
    ఎ) 1994    బి) 1995    సి) 1993    డి) 1992


28.    ఢిల్లీ శాసనసభకు ఉన్న అధికారాలు ఏమిటి?
        ఎ) ఢిల్లీ శాసనసభకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారం ఉంది
    బి) ఢిల్లీ శాసనసభకు రాష్ట్ర జాబితాలోని ప్రజా నియంత్రణ, భూమికి సంబంధించిన విషయాలు, పోలీస్‌ వ్యవస్థకు        సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం లేదు.    
        సి) ఎ, బి రెండూ సరైనవి
        డి) ఎ- సరైన సమాధానం కాదు, బి- సరైన సమాధానం


29.    హైకోర్టును కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
    ఎ) పాండిచ్చేరి          బి) ఢిల్లీ      సి) అండమాన్‌, నికోబర్‌ దీవులు    డి) డామన్‌, డయ్యు


30.    దాద్రానగర్‌-హవేలి, డామన్‌ డయ్యు ఏ రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్నాయి?
    ఎ) కేరళ   బి) గుజరాత్‌   సి) ముంబై   డి) చెన్నై


31.    ఢిల్లీ శాసనసభలో ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయి?
    ఎ) 70       బి) 69       సి) 65       డి) 80


32.    ఢిల్లీ శాసనసభలో మంత్రిమండలి సభ్యుల సంఖ్యను ఎంత శాతంగా నిర్ణయించారు?
    ఎ) 12      బి) 10      డి) 15      డి) 13


33.    ఢిల్లీ ముఖ్యమంత్రిని నియమించేది ఎవరు?
    ఎ) గవర్నర్‌          బి) అడ్మినిసే్ట్రటర్‌     సి) రాష్ట్రపతి           డి) లెఫ్టినెంట్‌ గవర్నర్‌


34.    శాసనసభ సమావేశం లేనప్పుడు ఢిల్లీలో అత్యవసర ఆజ్ఞలు (ఆర్డినెన్స్‌ల)ను ఎవరు జారీ చేస్తారు?
    ఎ) గవర్నర్‌             బి) రాష్ట్రపతి     సి) ముఖ్యమంత్రి           డి) లెఫ్టినెంట్‌ గవర్నర్‌


35.    కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
    ఎ) అండమాన్‌ నికోబర్‌ దీవులు, ఢిల్లీ, పుదుచ్చేరి పరిపాలనకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనే హోదా కలిగి ఉంటారు
    బి) చండీఘడ్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యు, లక్షదీవుల పరిపాలకులను అడ్మినిసే్ట్రటర్‌ అనే హోదాతో పిలుస్తారు.
    సి) ఎ, బి రెండూ సరైన సమాధానాలే
    డి) ఎ సరైన సమాధానం, బి సరైన సమాధానం కాదు


36.    కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?
    ఎ) రాజకీయ పరిపాలనా కారణాలతో ఢిల్లీ, చండీఘడ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు
    బి) సాంస్కృతిక పరంగా పుదుచ్చేరి, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యుని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు
    సి) వ్యూహాత్మక ప్రధాన్యతా దృష్ట్యా అండమాన్‌ నికోబర్‌, లక్ష దీవులను కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు
    డి) పైవన్నీ సరైన సమాధానాలే


37.    ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎవరు?
    ఎ) నజీబ్‌ జంగ్‌         బి) హర్షవర్ధన్‌     సి) రాజేష్‌ప్రసాద్‌          డి) ఎ.కె. సింగ్‌


38.    అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రస్తుత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పేరేమిటి?
    ఎ) నజీబ్‌ జంగ్‌             బి) ఎ.కె. సింగ్‌     సి) రాజేష్‌ ప్రసాద్‌             డి) అజయ్‌కుమార్‌ సింగ్‌


39.    పుదుచ్చేరి  ప్రస్తుత లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ ఎవరు?
    ఎ) నజీబ్‌ జంగ్‌          బి) ఎ.కె. సింగ్‌    సి) వి.శివరాజ్‌ పాటిల్‌   డి) విజయ్‌కుమార్‌ సింగ్‌


40.     చండీఘడ్‌ ప్రస్తుత పరిపాలకుడి పేరు ఏమిటి?
    ఎ) రాజేంద్ర ప్రసాద్‌     బి) వి. శివరాజ్‌ పాటిల్‌     సి) ఆశిష్‌ కుంద్రా        డి) షీలా దీక్షిత్‌


41.    శాసన సభలను కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలేవి?
    ఎ)ఢిల్లీ- చండీఘడ్‌      బి)పుదుచ్చేరి- గోవా      సి)పుదుచ్చేరి - ఢిల్లీ     డి) ఢిల్లీ - లక్షదీవులు


42.    పుదుచ్చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి పేరేమిటి?
    ఎ) ఎన్‌.రంగస్వామి      బి) రామస్వామి    సి) పన్నీర్‌ సెల్వం    డి) ఉమెన్‌ చాందీ


43.    పుదుచ్చేరికి చెందిన ‘మాహే’ భూభాగ ప్రాంతం సరిహద్దుగా కలి గిన రాష్ట్రం ఏది?
    ఎ) తమిళనాడు       బి) ఆంధ్రప్రదేశ్‌       సి) కర్ణాటక  డి) కేరళ


44.    పుదుచ్చేరిలో మాట్లాడే  అధికార భాషలు పేర్లు ఏమిటి?
    ఎ) తమిళం, మలయాళం    బి) తమిళం, తెలుగు, మలయాళం   
    సి) తమిళం, ఫ్రెంచి             డి) తమిళం, ఆంగ్లం


45.     అండమాన్‌, నికోబార్‌ దీవుల అధికార భాష ఏది?
    ఎ) హిందీ- ఆంగ్లం          బి) హిందీ- బెంగాలీ     సి) హిందీ- తమిళం          డి) పైవేవీ కావు


46.    కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక అక్షరాస్యత ఉన్న ప్రాంతం ఏది?
    ఎ) ఢిల్లీ   బి) చండీఘడ్‌   సి) పుదుచ్చేరి   డి) లక్షదీవులు


47.    కేంద్రపాలిత ప్రాంతాల లోక్‌సభ స్థానాల సంఖ్యకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
    ఎ) ఢిల్లీకి  ఏడు లోక్‌సభ స్థానాల ఉన్నాయి
    బి) ఢిల్లీ మినహా మిగిలిన ప్రతీ కేంద్రపాలిత ప్రాంతానికి లోక్‌సభలో ఒక్కో స్థానం ఉంది.
    సి) ఎ సరైన సమాధానం, బి సరైన సమాధానం కాదు
    డి) ఎ, బి రెండూ సరైన సమాధానాలు


48.    రాజ్యసభలో సభ్యత్వ స్థానాలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు పేర్లేమిటి?
    ఎ) ఢిల్లీ, చండీఘడ్‌       బి) ఢిల్లీ, పుదుచ్చేరి    సి) ఢిల్లీ, అండమాన్‌ నికోబర్‌ 
   డి) కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో స్థానాలు కేటాయించలేదు


49.    పుదుచ్చేరికి రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఉన్నాయి?
    ఎ) 1    బి) 2    సి) 3    డి) 4


50.       ఢిల్లీకి రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఉన్నాయి?
    ఎ) 1     బి) 4     సి) 3     డి) 2