భారత రాజ్యాంగ పరిషత్





భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభం అవుతుంది. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, మూలతత్వాన్ని తెలియజేస్తుంది. ప్రవేశిక, ప్రజల యొక్క ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతీకవంటిది. ఈ రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా వర్ణించింది. 

ప్రజలందరకు ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని కల్పించుట, అందరికీ సమానావకాశాలను కల్పించుట, వాక్‌ మరియు భావ స్వాతంత్య్రాన్ని ప్రజలందరూ అనుభవించేటట్లు కృషి చేయుట, ప్రజలందరితో సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడం అనేవి రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యాలుగా తెలియజేసింది.

 ఈ ప్రవేశిక భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా పేర్కొంది. అనగా రాజ్యాధినేత పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ఎన్నుకోబడవలెనని ప్రవేశిక తెలియజేసింది. ప్రవే శిక రాజ్యాంగానికి ఆత్మవంటిది.

ప్రవేశికలో సార్వభౌమాధికారం అనే పదం ప్రభుత్వ నిర్వహణలో రాజ్యానికి సర్వాధికారాలు ఉన్నాయని, ఏ విదేశీ ఒత్తిడికి తలవంచాల్సిన అవసరం లేదని, రాజ్యం విదేశాలకు ఎంత మాత్రం ఆధీనం కాదని స్పష్టమవుతుంది.

 కొందరి నిపుణుల అభిప్రాయంలో రాజ్యాంగ ప్రవేశిక భారత ప్రజలందరూ ఒకటేనని, సార్వభౌమా ధికారం వారందరి వద్ద సమిష్టిగా కేంద్రీకృతమై ఉందని అందువల్ల భారత ప్రజలు ఏ విదేశీ అధికారం ముందు సాగిలపడాల్సిన అవ సరం లేదు.


రాజ్యంగం చట్టంగా మారినప్పటి నుంచి ఇండియా 'డొమినియన్‌' కాదు. భారతదేశం ఒక సర్వసత్తాక రాజ్యం. ప్రఖ్యాత రాజనీతివేత్త మాడిసన్‌ అభిప్రాయంలో ఒక రిపబ్లిక్‌ తన అధికారాలను ప్రత్యక్షంగా కాని లేదా పరోక్షంగాని ప్రజల వద్ద నుంచి పొందుతుంది. 

రాజ్యం వివిధ ఆఫీసులను చేపట్టిన వ్యక్తుల ద్వారా వారు కొద్ది కాలానికి లేదా సత్ప్రవర్తనతో ఉన్నంత వరకు, ప్రజాభీష్టం మేరకు పరిపాలిస్తుంటుంది.

మనం స్వాతంత్య్రం పొందినప్పటికి 'కామన్‌ వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌'లో సభ్యులుగానే కొనసాగుతున్నాం. ఏప్రిల్‌, 1947లో జవహార్‌లాల్‌ నెహ్రు చేసిన సూచన అనుసరించి ఇండియా ఈ విధంగా 'కామన్‌వెల్త్‌' సభ్వత్వాన్ని పొందింది.

 అయితే ఇంగ్లాండ్‌ రాణి లేదా రాజు భారత్‌ దృష్టిలో కేవలం 'కామన్‌వెల్త్‌' దేశాల ఔపచారిక అధినేత. అలానే కామన్‌వెల్త్‌ నిర్ణయాలు భారత్‌ తప్పనిసరిగా ఆచరించాల్సినవి కావు. తన ఇష్టాఇష్టాల మేరకు మాత్రమే ఇండియా కామన్‌వెల్త్‌ నిర్ణయాలు అంగీకరిస్తుంది.

ప్రవేశిక 'ప్రజాస్వామ్యం' గురించి కూడా ప్రస్తావించింది. దీన్ని అనుసరించి మనదేశంలో పార్లమెంటరీ ప్రతినిధి ప్రజాస్వామ్యం ఉందని తెలుస్తోంది. 

వివిధ రాజ్యాంగ పదవులు ఎన్నికల ద్వారా సంక్రమిస్తాయి. న్యాయం అన్న పదం ఉపయోగించడం వల్ల తన ప్రవేశికను అనుసరించి ప్రజలందరికి సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించటం రాజ్యాంగ ఆశయమని అర్థమవుతుంది.

ఫ్రెంచ్‌ విప్లవ స్ఫూర్తి అయిన స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగ నిర్మాతలను ఆకర్షించింది. 

మన ప్రవేశికలో ఈ పదాలన్నీ ఉపయోగించారు. వీటిని బట్టి ప్రజాస్వామ్యంలోని పౌరులందరికీ స్వేచ్ఛ ఉందని, చట్టం ముందు అందరూ సమానులని, ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని వెల్లడవుతోంది.

42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన సామ్యవాద, లౌకిక రాజ్యం అన్న పదాలు భారతదేశ ప్రజాస్వామ్య విశిష్టతను చాటిచెబుతున్నాయి. ఆర్థిక స్వాతంత్య్రం లేనిదే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు. 

సమాజంలోని విభిన్న మతాలు, వర్గాల మధ్య ఘర్షణ లేకుండా అందరూ సోదరభావంతో మెలగటం వల్ల జాతి పురోగమించ గలుగుతుంది.

 భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావం
భారత రాజ్యాంగంపై బ్రిటన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా మొదలైన దేశాల రాజ్యాంగాల ప్రభావం స్పష్టంగా కనిపి స్తుంది. 

అందువలనే కొంత మంది విమర్శకులు దీనిని ''ఆ శిశగ శిుససుూnగ'' అని పేర్కొన్నారు. మరి కొంతమంది మన రాజ్యాంగాన్ని కలగూర గంపగా వర్ణించారు.

మన రాజ్యాంగంలోని అనేక అంశాలు 1935 గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చట్టం నుంచి గ్రహించబడ్డాయి. 

ఉదాహరణకు భారత రాజ్యాంగంలోని 395 చట్టం నుంచి తీసుకోబడినవే. ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టులకు సంబంధించిన ప్రకరణలు అమెరికా రాజ్యాంగం నుంచి, ఆదేశిక సూత్రాలు ఐరిస్‌ రాజ్యాంగం నుంచి, ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించారు. 

బ్రిటిష్‌ రాజ్యాంగం వలె మన రాజ్యంగం కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలానే కెనడా రాజ్యాంగం వలె మన రాజ్యాంగము కూడా దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొన్నది.

భారత రాజ్యాంగం పాశ్చాత్య విలువలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను సమన్వయపరచినది. 

దీనివల్ల భారత రాజ్యాంగం కొత్త పాతల సమ్మేళనం అని తెలుస్తుంది. మన రాజ్యాంగ నిర్మాత ప్రధాన కోరిక ''సక్రమంగా పనిచేయ గల రాజ్యాంగం'' మాత్రమే.

 కనుక మన దేశ పరిస్థితులకు సంప్రదాయాలకు అను కూలమైన విషయాలు రాజ్యాంగంలో పొందుపర్చినారు.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పిన విషయాలు మననం చేసుకోవడం అవసరం. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను పరి శీలించి వాటిలోని గొప్ప గొప్ప అంశాలను గ్రహించి వాటిని భారతదేశం యొక్క పరిస్థితులను అనుకూలంగా మార్చి మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. 

ఆ విధంగా చేయటం తప్పుకాదు. అనుకరణ ప్రకృతి సిద్ధమైనది' అని భారతదేశ ప్రజాస్వామ్యంలో వాటిని ప్రవేశపెట్టుట ఆధునీకరణలో ఒక భాగం మాత్రమేనని, రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏ ఒక్క దేశపు సొమ్ము కాదని పేర్కొన్నారు.

3. లిఖిత రాజ్యాంగం
సమాఖ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం లిఖితమైంది. లిఖిత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలు నిర్ణయించడానికి ఎంతైనా అవసరం. 

భారతదేశంలో రాష్ట్రాల విభజన తరువాత రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు స్పష్టంగా నిరూపించవలసిన ఆవశ్యకత ఏర్పడుట వల్ల, మన రాజ్యాంగకర్తలు భారత రాజ్యాంగాన్ని లిఖితమైనదిగా తయారు చేశారు.

4. సుదీర్ఘ రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఎంతో పెద్దది మరియు ఇతర రాజ్యాంగాలన్నింటి కన్నా సుదీర్ఘమైంది. ప్రస్తుతం 450 అధికరణాలు, 12 షెడ్యూళ్లు కలవు. ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించిన వివరాలు రాజ్యాంగంలో విపులీకరించుటవల్ల ఇతర రాజ్యాంగాలన్నింటికంటే పెద్దదిగా తయారైంది. 

దానికి గల కారణాలను విశ్లేషిస్తూ మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను సవివరంగా పొందు పరిచారు. మరియు నిర్దేశిక నియమాలను ప్రస్తావించారు. 

ప్రాథమిక విధులను కూడా రాజ్యాంగంలో చేర్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల స్వరూపాన్ని వాటికి సంబంధించిన పరిపాలన మొదలగు వివరాలను పేర్కొనడం జరిగింది. భారతదేశ అధ్యక్షుని అత్యవసర అధికారాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల నిర్మాణాలు, వివిధ కమిషన్ల నియమ నిబంధనలు (ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) మొదలైన విషయాలను సవివరంగా పేర్కొనడం జరిగింది. 

భారత దేశ జనాభాలో ఉన్న విభిన్న మతాలు, భాషలు, తెగలు, వెనుకబడ్డ ప్రాంతాలు, అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు మొదలైన అంశాలన్నీ కలిసి భారత రాజ్యాంగం సుదీర్ఘం కావడానికి కారణమయ్యాయి.

భారత రాజ్యాంగం మూడు భాగాలు

భారత రాజ్యాంగాన్ని మూడు భాగాలు విభజించవచ్చు. అవి.

1. రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక 2. అధికరణలు 3. షెడ్యూళ్లు

రాజ్యాంగ ప్రవేశిక లేదా రాజ్యాంగ పీఠికను జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాలు తీర్మానం ఆధారంగా రూపొందించారు. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం గురించి ఇలా తెలుపుతుంది.

భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దటానికి కృతనిశ్చయులపై ఉండి భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలలో ..... న్యాయాన్ని భావాలలో, భావవ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసాలలో.... స్వాతంత్య్రాన్ని హోదా మరియు అవకాశాలలో - సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ వ్యక్తుల గౌరవం కాపాడతామని, జాతీయ సమైక్యతను పాటుపడతామని హామీ ఇస్తూ.... దీనిని నవంబర్‌ 26, 1949 రాజ్యాంగంలో రాజ్యాంగ పరిషత్తులో చర్చించి మాకు మేము సమర్పించుకుంటున్నాము.
రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనను నవంబర్‌ 26, 1949న పూర్తి చేయడం జరిగింది.

 అయితే రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రోజున అమల్లోకి రావడానికి కారణం 1930 లాహోర్‌లో జవహార్‌లాల్‌ నెహ్రూ అధ్య క్షతన జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సమావేశంలో జనవరి 26న పూర్ణ స్వరాజ్‌ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆరోజు స్వరాజ్‌ దినంగా జరుపుకుంటున్నారు. 

జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి తీసుకురావడానికి ఇది ఒక కారణం.

రాజ్యాంగ ప్రవేశికకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, జాతీయ సమైక్యత అనే పదాలను కలపడం జరిగింది. సామ్యవాద అంటే ప్రజలందరికీ ఆర్థిక సమానత్వాన్ని కలిగిస్తూ సంపదను కేంద్రీకరించకుండా చూడటం. 

లౌకిక అనే పదానికి రాజ్యం ఏ మతాన్ని రాజమతంగా భావించదు. అలాగే ఏ మతానికి ప్రత్యేక సౌకర్యాలు కలుగజేయటం జరగదు. రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని మౌలిక అంశం.

 రాజ్యాంగంలోని మౌలిక అంశాలను పార్లమెంట్‌లో 368వ అధికరణం ద్వారా సవరించగలదా? లేదా? అనే ప్రశ్న కింది కేసులలో ఉత్పన్నం అయింది. ఈ కేసులలో రాజ్యాంగంలోని మౌలిక అంశాల గురించి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది.

1. బేరుబెరి కేసు
2. కేశవానంద భారత ు కేరళ ప్రభుత్వం
3. ఇందిరా నెహ్రూగాంధీ ు రాజ్‌ నారాయణ
4. మినర్వా మిల్స్‌ ు కేంద్ర ప్రభుత్వం

బేరుబెరి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవెెశిక రాజ్యాంగంలో భాగం కాదని వ్యాఖ్యానించింది. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును సమీక్షించుకుని ప్రవేశిక రాజ్యాంగంలో భాగం అని స్పష్టంగా ప్రకటించింది.

రాజ్యాంగంలోని మౌలిక అంశాలు శాసనసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికార విభజన అనేది మౌలిక అంశమని సుప్రీం కోర్టు పేర్కొనడం జరిగింది. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగమని పేర్కొనడం జరిగింది.

రాజ్యాంగంలో సామాజిక న్యాయం గురించి చెబుతూ కోర్టుల ఆర్థిక అసమానతలను తొలగించేందుకు, గౌరవప్రదంగా ప్రజలు జీవించేందుకు, బలహీన వర్గాల సంరక్షణకు కలిగించేందుకు శాసన వ్యవస్థలు చట్టం చేయవచ్చునని తెలియజేశారు.