జూన్ - 2014 దినోత్సవాలు

జూన్ - 14
¤  ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జూన్ - 24
¤  పాస్‌పోర్టు సేవా దివస్‌ను న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు.   

»    ఈ సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినవారికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అవార్డులు అందజేశారు.   

»    పాస్‌పోర్టు జారీలో అత్యంత ముఖ్యమైన పోలీస్ నిర్ధారణ (వెరిఫికేషన్) ప్రక్రియను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగాలను ఈ పురస్కారాలతో సత్కరించారు.   

»    2013-14 సంవత్సరానికి పోలీస్ కేటగిరీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఈ పురస్కారాలు లభించాయి.