కిరణజన్య సంయోగక్రియావిధానం




కిరణజన్య సంయోగక్రియావిధానం

1. కాంతి కిరణాల్లో ఉండే శక్తిని ఏమంటారు?జ: క్వాంటమ్ శక్తి.2. ఆకుపచ్చ కాంతిని, పత్రహరిత వర్ణద్రవ్యం ఏం చేస్తుంది?
జ: పరావర్తనం చెందిస్తుంది.
3.  వేటి త్వచాల దొంతరలను 'గ్రానా' అంటారు?
జ:  థైలకాయిడ్లు. 
4. కిరణజన్య సంయోగక్రియలో పత్రహరిత అణువు  పొందే చర్య  ఏది?
జ: ఆక్సీకరణం.
5. కాంతి చర్యల తుది ఉత్పత్తులు ఏవి?
జ: ATP, NADPH 
6. కిరణజన్యసంయోగక్రియలో పరిశోధనకు గాను నోబెల్ బహుమతి పొందిన  శాస్త్రవేత్త ఎవరు?
జ: మెల్విన్ కాల్విన్.

7. కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది?
జ: హరితరేణువులు      
8. మెల్విన్ కాల్విన్ కు ఏ పరిశోధనలు చేసినందుకు నోబెల్ బహుమతి దక్కింది?
జ: కార్బన్ స్థాపన
9. మొక్కల్లో వాయుమార్పిడి జరిగే స్థలం ఏది?
జ: పత్రరంధ్రాలు