ఇంటర్నెట్ చరిత్రలో మొదటి సారిగా సబ్జెక్టుల వారిగా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్
Home / Unlabelled / జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
జంతువులు, పక్షుల్లో ఆకర్షణీయమైన భాగాల్లో తోక ఒకటి. అవి తోకను రకరకాలుగా ఉపయోగిస్తుంటాయి. కోతులు చెట్లు ఎక్కడానికి తోకను ఆధారంగా చేసుకుంటాయి. కాళ్లు, చేతుల కంటే వాటి తోక దృఢంగా ఉంటుంది. జంతువులన్నింటిలోకి పొడవైన తోక జిరాఫీకి ఉంటుంది. అపాయం కలిగినప్పుడు తోకను శరీరం నుంచి వేరుచేసుకోగలిగేే ఏకైక జీవి బల్లి. కుక్కలు ఉల్లాసంగా ఉన్నప్పుడు తోకను ఆడిస్తుంటాయి. పిల్లి కోపాన్ని తెలియజేయడానికి తోకను నిక్కబొడుస్తుంది. వివిధ పక్షులు చెట్లపై వాలడానికి, ఎగరడానికి తోకలు సాయపడతాయి. వడ్రంగి పిట్ట తోకను మూడో కాలుగా ఉపయోగించుకుంటుంది. గొర్రెలు తోకను దించుకొని నడిస్తే, మేకలు తోకలు పైకెత్తితేగాని సులభంగా నడవలేవు. మగ నెమళ్లు ఆడ నెమళ్లను ఆకర్షించడానికి పురి(తోక) విప్పుతాయి. కంగారూ తోకను పట్టుకొంటే గెంతలేదు. అవి గెంతులు వేయడానికి తోకను బ్యాలెన్స్ చేసుకుంటాయి. థామస్ ఆల్వా ఎడిసన్‌కు 1300 వస్తువులపై పేటెంట్ హక్కులున్నాయి. ఎలుక గుండె నిమిషానికి 650సార్లు కొట్టుకొంటుంది. గబ్బిలాలు మాత్రమే నీలం రంగును చూడగలిగే పక్షులు. రాత్రిపూట కూడా మన కళ్లు ఇంద్రధనస్సును స్పష్టంగా చూడగలవు. మనిషి గుండె ఏడాదికి మూడు కోట్ల సార్లు కొట్టుకొంటుంది. మనిషి శరీరంలో రక్తం రోజుకి 96,540 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒక వయోలిన్ తయారీలో దాదాపు 70 కొయ్య ముక్కలను వాడతారు. లండన్‌లో ప్రతి 4.5 నిమిషాలకూ ఒక వ్యక్తి దొంగతనానికి గురవుతున్నాడు. భూమి మిగిలిన రోజుల కంటే పౌర్ణమి రోజున 0.02 డిగ్రీలు ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. బుల్‌ఫ్రాగ్ జాతి కప్పలు అసలు నిద్రపోవు. ఇంకా చదవండి: పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?