గ్రంథాలయాలు ఎప్పుడు పుట్టాయో తెలుసా?


   మన మెదడు అన్నింటినీ నిక్షిప్తపరుస్తుంది. కావలసి నప్పుడు గుర్తు తెచ్చుకునేందుకు సహకరిస్తుంది. ఇలా సరి చూసుకునేందుకు మన మెదడు మనకు ఉపయోగపడుతూ,
 మరొకరికి అదే విజ్ఞానాన్ని కొన్నేళ్ళ తర్వాత అందించాలంటే కష్టమే మరి. 

ఇక ఆ సమస్య నుంచి బయటపడడానికి మనిషి చేసిన ప్రయత్నమే 'పుస్తకం'. తాను
 అనుకున్న భావాలను వ్యక్తపరచడానికి పుస్తకాల రూపం సరిగ్గా సరిపోయింది. ప్రతి 
విషయాన్ని పరిశీలించి, శోధించి రాసిన పుస్తకాలు ఇన్ని అని చెప్పడం చాలా 
కష్టమైన పని. 


వీటిని భద్రపరిచేందుకు ఒక చిన్న ఇల్లు కట్టాల్సి వచ్చింది. దానినే మనం 'లైబ్రరీ' లేదా 'గ్రంథాలయం' అని పిలుస్తాం. క్రీస్తు పూర్వమే గ్రంథాల యాలు పెట్టాలనే ప్రయత్నాలు 
జరిగాయి. ఆనాటి గొప్ప రాజవంశీయుడు అబ్రహాం పరిపాలించిన నగరం 'ఉర్‌'. 

ఈ నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో రాజముద్రిక దొరికింది. చిన్న స్తూపాకారంలో ఉన్న ఈ ముద్రిక పైన కొన్ని రాతలు కనుగొన్నారు. ఈ రాతలు
 క్రీస్తు పూర్వం 800 నాటివని తెలుసుకున్నారు. ప్రపంచంలోనే దీనిని మొట్టమొదటి
 లైబ్రరీగా నిర్ధారించారు.


క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల మునుపే మెసపటోమియా వారు గుళ్ళల్లోనూ, తమ
 రాజమందిరాల ల్లోనూ గ్రంథాలయాలను నిర్మించారు. ఇక్కడి లైబ్రరీలో చదునైన
 రాతిపలకలను పుస్తకాలుగా వాడేవారు. వేల పుస్తకాలను ఒక క్రమపద్ధతిలో 
విషయాన్ని బట్టి గుళ్ళల్లోనూ, రాజమందిరాలలో భద్రపరిచేవారు. ఇదే మొట్ట
 మొదటి లైబ్రరీ. 

ఈజిప్టులోనూ ఇదే విధంగా దేవాలయాలను గ్రంధాలయాలుగా వాడేవారు. ఇక్కడి 
పూజారులు వీటిని సంరక్షించేవారు. పాపిరస్‌ అనే ఆకులతో తయారుచేసిన (చుట్టిన)
 పత్రాలను వాడేవారు. వీటినే 'రోల్స్‌్‌' అని పిలిచేవారు. క్రమపద్ధతిలో అమర్చిన 
'రోల్స్‌' మన నేటి లైబ్రరీల పోలికను కలిగి ఉండేవి.

రోమన్లకు లైబ్రరీలంటే ఆసక్తి లేకపోయినా, గ్రీకు వారిని చూసి తామూ ఏర్పాటు 
చేసుకుంటే బాగుంటుందనే భావంతో ప్రారంభించారు. ప్రజలకు కావలసిన రీతిలో 
గ్రంథాలయాలు స్థాపించడానికి ఇదే సహకరించింది. 

నాల్గవ శతాబ్ధంలో 28 ప్రజా గ్రంథాలయాలను స్థాపించారు. కానీ ఉత్తర దేశీయులు 
రాచరికంలో అనాగరిక చర్యల వల్ల చాలా పుస్తకాలు నాశనమయ్యాయి. 

నేడు మనం చూస్తున్న, వాడుతున్న గ్రంథాలయాలు 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో 
ప్రారంభించినవి. ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌లోని 1850వ చట్టం ప్రకారం పబ్లిక్‌ లైబ్రరీలు 
స్థాపించారు. అలా మొదలైన లైబ్రరీలే నేటి నాగరిక జీవనంలో మూలస్తంభాలుగా
 మారాయి.

ఇంకా :


మీ పేరులోని మొదటి అక్షరం మీ సామర్థ్యం గురించి తెలియచేస్తుంది.?
భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?
ఇవి జరిగితే మీరు దెయ్యాన్ని చూసినట్లే ?
యంత్రాలతో ప్రయోజనమేనా?