టీ బ్యాగ్‌'లను ఎవరు కనుగొన్నారు?



మనదేశంలో అయితే అంతగా వాడకంలో లేవుగానీ పాశ్చాత్యదేశాల్లోనూ, ఆఖరికి మన 
పొరుగు దేశమైన శ్రీలంక వంటి దేశాల్లో కూడా నేడు టీబ్యాగులను విరివిగా వాడుతున్నారు. 
తొందరగా టీ చేసుకొనేందుకు వీలు కల్పించడం, పైగా ఇలా తÄయారయ్యే టీ కూడా రుచిగా 
ఉండటం అనే కారణాల వల్ల వీటికి బాగా ఆదరణ లభించింది. వేడినీటిలో కరిగిపోని పదార్థంతో తÄయారుచేసే పలుచని, చిన్నచిన్న సంచుల్లో... ఒకటి రెండు చెంచాల టీ పొడిని వేసి, 
దాని మూతిని మూసివేస్తారు. దీనినే టీబ్యాగ్‌ అంటారు. 

ఈ సంచీకి సుమారు ఓ జానెడు పొడవుండే దారం కూడా కట్టబడుతుంది. మనం ఓ కప్పుడు
 వేడివేడి పాలను తీసుకుని, ఆ పాలలో ఈ టీ సంచిని కొంచెం సేపు ముంచి ఉంచితే చాలు. 
సంచిలోని టీపొడి తాలుకూ రసం పాలలోకి చేరి, కమ్మటి టీ తయారవుతుంది. టీ సంచిని
 ఏ చెంచాతోనో వత్తి పిండితే మరింత రసం పాల లోకి దిగుతుంది. 

తరువాత ఈ సంచిని తీసి పడేసి ఎంచగ్గా టీ తాగవచ్చు. ఇదీ టీ బ్యాగుల వల్ల ఉన్న 
ఉపయోగం. అయితే వీటిని ఏ శాస్త్రజ్ఞులో పనిగట్టుకొని కనిపెట్టలేదు. దీనికి సంబంధించిన 
కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
tea bag కోసం చిత్ర ఫలితం

ఇప్పటికి సుమారు ఓ వందేళ్ళ కిందట... అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి చెందిన 
థామస్‌ సల్లివాన్‌ అనే ఓ కాఫీ వర్తకుడు అనుకోకుండా ఈ ఆవిష్కరణకు కారణమయ్యాడు.
 కాఫీ పొడిని, టీ పొడిని చిన్నచిన్న సంచుల్లో (సాచెట్స్‌) పెట్టి అమ్మినట్లయితే వాటిని 
ఎక్కువమంది కొంటారని, వాటిని రవాణా చేయడం కూడా సులభమవుతుందని 
భావించిన ఆ కాఫీ వర్తకుడు ప్రత్యేకంగా చిన్నచిన్న సిల్కు సంచులను అందుకోసం 
తయారు చేయించి, వాటిలో టీ పొడిని నింపి మార్కెట్‌లోకి విడుదల చేశాడు. 

అయితే వాటిని కొన్న వినియోగదారుల్లో కొందరు - ఆ సంచులను విప్పాల్సిన అవసరం 
లేదని భావించి, వాటిని అలాగే వేడినీళ్ళలో మరగబెట్టారు. టీ పొడిలోని రసం నీళ్ళలోకి 
దిగడం, అదే సమయంలో మరోపక్క టీ పొడి నీళ్ళలో కలవకపోవడం (దీనివల్ల ఫిల్టర్‌ 
చేయాల్సిన అవసరం తప్పుతుంది) అనేది వారికి బాగా నచ్చింది

 సరిగ్గా, అలా కొందరు వినియోగదారులు చేసిన ఓ చిన్న పొరపాటు మూలంగానే 
టీ బ్యాగులు ఉనికిలోకి వచ్చాయి. ఆ తరువాత అవి బాగా అభివృద్ధి చేయబడి 
అమెరికాలోను, ఐరోపా దేశాలలోనూ విశేష జనాదరణను పొందుతున్నాయి.