''రాతియుగం'' అంటే ఏమిటి ?

      

 మానవుడు రాతి పని ముట్లను ఉపయోగించిన దశను మానవ చరిత్రలో ''రాతియుగం''
 అంటారు. దీన్ని పాత రాతియుగం, మధ్య రాతియుగం, కొత్త రాతియుగం అనే మూడు 
భాగాలుగా విభజించారు.


             మనిషి ఆకారంలో గల ''ఆస్ట్రోలో ఫిధీసీన్స్‌'' అనే జంతువులు కనిపించడంతో 
పాత రాతియుగం ప్రారంభమైంది. ఈ యుగంలో మనుషులందరూ వేటగాళ్లు, వారి 
పనిముట్లన్నీ అతి మోటుగా వుండేవి. అతి ప్రాచీనమైన పాత రాతి యుగపు పనిముట్లు 
25,00,000 సంవత్సరాల నాటివి. పాతరాతి యుగం 10,000 సంవత్సరాల పాటు 
కొనసాగింది.


            క్రీస్తు పూర్వం 8000 సంవత్సరం నుంచి 2700 సంవత్సరాల వరకూ వాయువ్య 

యూరప్‌లో  జరిగిన పురోభివృధ్ధిని మధ్యరాతి యుగంగా పేర్కొంటారు. ఈ యుగంలో 
పదునైన రాతి పనిముట్లను ఉపయోగించే వారు. విల్లు, బాణాలను మొదటిసారిగా 
ఈ యుగంలోనే ఉపయోగించారు. కొత్త రాతియుగంలో యూరప్‌లో వ్యవసాయం, 
కుండల తయారీ బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. జంతువులను మచ్చిక చేసుకుని, 
వాటితో పని చెయించుకునెవారు.