ఇ - మెయిల్ ఎవరు కనుగొన్నారో తెలుసా ?

 'ఎలక్ట్రానిక్‌ మెయిల్‌' అనే మాటనే క్లుప్తంగా ఇ-మెయిల్‌ అని అంటారు. ఒక విధంగా, 
మనం ఏ పోస్టుకార్డు మీదో, తెల్లకాగితం మీదో రాసే ఉత్తరానికి ఇదొక పర్యాయపదం. 
కంప్యూటర్లు ఎలక్ట్రానిక్‌ పరికరాల కిందికి వస్తాయి కాబట్టి కంప్యూటర్ల ద్వారా పంపించే 
మెయిల్‌ని (ఉత్తరాలని అనుకోవచ్చు) ఇ-మెయిల్‌ అని అంటున్నారు. 

ఎలక్ట్రానిక్‌-మెయిల్‌లో భాగంగా ఉత్తరాలు గానీ, ఆఫీసు పత్రాలు (డాక్యుమెంట్లు) 
గానీ ఒక కంప్యూటర్‌ నుంచి మరో కంప్యూటర్‌కి అవలీలగా చేరుకుంటాయి. అంతేకాదు, 
ఒకే కంప్యూటర్‌ నుంచి అనేక వందలు, లేదా వేల కంప్యూటర్లకి ఒకే సమయంలో ఒక 
సమాచారాన్ని క్షణాలలో పంపించేందుకు కూడా వీలవుతుంది.


ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత అవసరాలకు, ఆఫీసు పనులకు, ఇంకా వ్యాపార
 లావాదేవీల కోసం ప్రతిరోజూ కొన్ని కోట్ల ఇ-మెయిల్స్‌ని పంపుకుంటు న్నారు. 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ల మధ్య ఈనాడు నెలకు కొన్ని వందల కోట్ల 
ఇ-మెయిల్సు నడుస్తున్నాయంటే వాటి వాడకం ఎంత విస్తృతంగా  ఉందో 
అర్థం చేసుకోవచ్చు.

  మామూలు పద్ధతిలో మనం రాసే ఒక ఉత్తరం తపాలాశాఖ ద్వారా గానీ, లేదా మరో 
సంస్థ ద్వారా గానీ అవతలి వ్యక్తికి చేరడానికి ఆÄయా పరిస్థితులను బట్టి, దూరాలను 
బట్టి కొన్నిరోజుల నుంచి కొన్ని వారాల వరకూ సమయం పట్టవచ్చు. కానీ ఇ-మెయిల్‌ 
రూపంలో పంపించే ఉత్తరం పొరుగు రాష్ట్రం వారికైనా, పొరుగు దేశం వారికైనా, ఆఖరికి 
ఓ నాల్గైదు ఖండాల అవతల ఉన్నవారికైనా సరే అప్పటి కప్పుడు (మనం పంపించిన 
కొన్ని సెకన్లలోనే) చేరిపోతుంది. 

అలాగే వారిచ్చే ప్రత్యుత్తరం కూడా మనకు వెంటనే చేరుతుంది.  ఇ-మెయిల్స్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక సాంప్రదాయ పద్ధతిలో ఉత్తరాలు రాసుకోవడం అనేది బాగా 
తగ్గిపోయింది. అయితే దీని ఫలితంగా ప్రతి రోజూ టన్నులకొద్దీ కాగితం వాడకం తగ్గి, 
పరోక్షంగా అది పర్యావరణానికి మేలు చేకూరుస్తోంది.

  మామూలు పద్ధతిలో ఉత్తరాలు రాసేవారిలో లాగానే, ఇ-మెయిల్స్‌ని ఎక్కువగా
 పంపే వారిలో కూడా రాసే నైపుణ్యం బాగా పెరుగుతుంది.