'కుక్క బొమ్మ' చిహ్నం, అందులో 'విశ్వాసపాత్రం', 'స్నేహపాత్రం' అనే మాటలుండే ఎంబ్లమ్ ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్ - జాతీయ బ్యాంకులు





జనరల్ నాలెడ్జ్ బిట్స్
జాతీయ బ్యాంకులు 
ప్రస్తుతం ఉన్న జాతీయ బ్యాంకులు ఎన్ని?
జ:  19


భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఏది? 
జ:  భారతీయ స్టేట్ బ్యాంకు


బ్యాంకుల బ్యాంకర్ ఏది? 
జ:  ఆర్.బి.ఐ


భారత రిజర్వ్ బ్యాంకును ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకొంది? 
జ:  1948


నరసింహన్ కమిటీ సిఫార్సుల ప్రకారం విలీనమైన రెండు జాతీయ బ్యాంకులు ఏవి? 
జ:  పంజాబ్ నేషనల్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా 


మూలధన మార్కెట్‌లో ఉపయోగించే సంక్షిప్త నామం  'SRO' కు పూర్తి రూపం: 
జ:  సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్


బుల్, బిగ్ పదాలు ఏ వాణిజ్య కార్యకలాపాల విభాగానికి సంబంధించినవి? 
జ:  షేర్ మార్కెట్

బాసెల్ (Basal)- II, దేనికి సంబంధించింది?
జ:  బ్యాంకు మూలధనం అడిక్వసీని మాపనం చేసే అంతర్జాతీయ ప్రమాణాలు 

భారతదేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ విధులను ఏది నిర్వహిస్తుంది?
జ:  భారత రిజర్వ్ బ్యాంకు 

 తమ చేతిలో ఉన్న నగదుకూ, మొత్తం ఆస్తులకూ మధ్య ఒక నిష్పత్తిని బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిష్పత్తిని ఏమంటారు?
జ:  చట్టబద్ద ద్రవ్యత్వ నిష్పత్తి

 రెపోరేటు అంటే-
జ:  భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకులకు అప్పు ఇచ్చే రేటు

 'కుక్క బొమ్మ' చిహ్నం, అందులో 'విశ్వాసపాత్రం', 'స్నేహపాత్రం' అనే మాటలుండే ఎంబ్లమ్ ఉన్న   ప్రభుత్వరంగ బ్యాంకు ఏది?
జ:  సిండికేట్ బ్యాంకు

 S & P CNX నిఫ్టీ అంటే ఏమిటి? 
జ:  బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లోని 50 పెద్ద కంపెనీలకు సూచీనే S & P CNX నిఫ్టీ 

జాతీయాదాయాన్ని అంచనా వేసే పద్ధతి కానిది ఏది?
జ:  ఎగుమతి - దిగుమతి పద్ధతి

భారత జాతీయాదాన్ని ప్రధానంగా దేని ద్వారా అంచనా వేస్తారు?
జ:  ఉత్పత్తి, ఆదాయ పద్ధతులు 

అడ్వలోరెమ్ (advalorem) అనే పన్నుకు ప్రాతిపదిక ఏది?
జ:  సరుకు ధర

భారతదేశంలో బడ్జెట్ విధానాన్ని ఏ వైస్రాయ్ కాలంలో ప్రవేశపెట్టారు?
జ:  కానింగ్

 నియంత వ్యవస్థ మౌలిక లక్షణాలు-
జ:  నియమాలు, నిబంధనలు 

తక్కువ నాణ్యత ఉన్న వస్తువు ధర పడిపోతే దాని డిమాండ్-
జ:  స్థిరంగా ఉంటుంది

 సమాంతర ఆర్థిక వ్యవస్థ లేదా నల్లధనం వల్ల-
జ:  ద్రవ్య విధానాల ప్రభావం తగ్గుతుంది 

 13వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ:  విజయ్ కేల్కర్

 భారతదేశంలో జాతీయాదాయాన్ని సరిగ్గా లెక్కగట్టడంలో ఉన్న సమస్య-
జ:  మోనటైజ్ కాని వినియోగం

 1991 సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం పన్ను విధింపు రంగంలో వివిధ రకాల సంస్కరణలను అమలుచేసింది. దీనికి ఏ కమిటీ సిఫార్సులు ఆధారమయ్యాయి?
జ:  రాజా చెల్లయ్య కమిటీ

 అభివృద్ధి అనేది-
జ:  ఆర్థిక వృద్ధి కంటే విస్తృతమైంది

స్వల్పకాలంలో ఒక ఉత్పత్తిదారు ఏ వ్యయం వచ్చేవరకు తన ఉత్పత్తిని కొనసాగిస్తాడు?
జ:  స్థిర వ్యయం

 సేవాపన్ను- 
జ:  కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కార్మికులున్న పరిశ్రమ ఏది?
జ:  జౌళి పరిశ్రమ

భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఇనుము, ఉక్కు కర్మాగారం-
జ:  జంషెడ్‌పూర్‌లోని టిస్కో (Tisco)

 భారతదేశ విభజన వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమ ఏది?
జ:  జనుము, పత్తి
 అత్యధిక సంఖ్యలో వ్యవసాయాధారిత పరిశ్రమల పరంగా ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం
జ:  పంజాబ్

 భారతదేశంలోని ఏ పరిశ్రమలో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు?
జ:  తేయాకు

 భారతదేశానికి గరిష్ఠ పరిమాణంలో విదేశీ వర్తకం ఉన్న దేశం-
జ:  యు.ఎస్.ఎ.

ఏదైనా పారిశ్రామిక యూనిట్‌ను సంబంధంగా ఖాయిలా యూనిట్‌గా ప్రకటించే అధికారం 
ఉన్న ఏజెన్సీ ఏది? 
జ:  బిఐఎఫ్ఆర్

 సంపూర్ణ పోటీలో-
జ:  ఏ సంస్థ అయినా మార్కెట్‌లో ధర, సరఫరాలపై ప్రభావం చూపగలదు

బొకారో స్టీల్ లిమిటెడ్ ఏర్పాటుకు సహకారం అందించింది-
జ:  సోవియట్ యూనియన్

  వియ‌త్నాం, బ్రూనై దారుస్సలామ్, బంగ్లాదేశ్, మ‌యాన్మార్  దేశాల్లో  ఏసియన్ (ASEAN)లో సభ్యదేశం కానిది?
జ:  బంగ్లాదేశ్




 అల్జీరియా, బ్రెజిల్‌,  ఈక్వెడార్,  నైజీరియాలో పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) సభ్యదేశం కానిది-
జ: బ్రెజిల్‌

 ప్రపంచ అభివృద్ధి నివేదికను వార్షికంగా ప్రచురించేది-
జ:  అంతర్జాతీయ పునర్నిర్మాణం, అభివృద్ధి బ్యాంకు

 మానవ వికాస సూచీలో అక్షరాస్యత రేట్లు, జనన సమయంలో జీవితాశంస కాలంతో పాటుండే మరో అంశం-
జ:  తలసరి వాస్తవ కొనుగోలు శక్తిలో స్థూల దేశీయోత్పత్తి

 ఉరుగ్వే రౌండ్ సంప్రదింపుల ఫలితంగా ఏర్పాటైంది-
జ:  డబ్ల్యుటిఒ(WTO)  

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment