పుట్టగొడుగులు ఎక్కడి నుండి వస్తాయి?


 వర్షాకాలంలో మనకి అక్కడక్కడా బోలెడు పుట్టగొడుగులు కనిపిస్తుంటాయి. 
ఇవి నిజమైన మొక్కలు కావు. ఇవి ఫంగస్‌ జాతికి చెందినవి. 

ఇవి ఒక కాడ, దానిపై గొడుగులాంటి ఆకారంతో చూడముచ్చటగా ఉంటాయి. 
కానీ వీటిని ఎవరూ పాతకుండా, గింజలు ఎవరూ చల్లకుండా ఎలా వచ్చాయి? 

గొడుగులాంటి డిప్ప కింద చూస్తే బోలెడన్నీ 'అరలు' కనిపిస్తాయి. వాటి మధ్య
 'స్పోర్‌లు' ఉంటాయి. అవి గాలికి ఎటెటో వెళ్లిపోతాయి. ఎప్పుడైనా అనుకూల 
పరిస్థితులు వస్తే, అప్పుడు పుట్ట గొడుగుల్లా పుడతాయి. 

కొన్నిసార్లు అవి గుండ్రంగా, వలయాల్లా ఉంటాయి. వీటిని ఫెయిరీరింగ్‌ అంటారు. 
కొన్నేమో చెట్ల కాండం అంచులంచులుగా ఉంటాయి. వీటిలో పోషకాలు మెండు.



పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి