సమాచార హక్కు చట్టం, 2005



ప్రతి అధికాఅయంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకూ, పౌరులకున్న సమాచార హక్కును చట్టబద్ధం చేయడం కోసం, కేంద్రసమాచార కమిషన్‍ను నెలకొల్పడం కోసం, సంబంధిత ఇతర అంశాల కోసం ఉద్దేశించినది ఈ చట్టం.

భారత రాజ్యాంగం గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా, ప్రభుత్వాలూ, వాటి అంగాలూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా ప్రజాస్వామ్యంలోని పౌరులకు విషయ పరిజ్ఞానం ఉండడం, సమాచారంలో పారదర్శకత చాలా ముఖ్యం. అయితే సమాచారాన్ని బహిర్గతం చేయడం అన్నది ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వ కార్యక్రమాల సమర్థత, పరిమిత ద్రవ్యవనరుల సమర్థ వినియోగం, సున్నిత సమాచారం గోప్యతను కాపాడడం వంటి ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా మారే అవకాశం ఉంది. అందువల్ల సమాచార హక్కు అన్న ప్రజాస్వామ్య ఆశయానికి పెద్దపీట వేసే క్రమంలో ఈ వైరుధ్యాలను తొలగించాల్సిన అవసరం ఉంది.

కాబట్టి, పౌరులు కోరే సమాచారాన్ని వారికి అందించే విధానం రూపొందించాల్సి ఉంది.
ఈ కింద రూపొందించిన విధానానికి భారత రిపబ్లిక్ 56వ సంవత్సరంలో పార్లమెంట్ చట్ట రూపం ఇచ్చింది.
అంతర్జ్జాలంలో: జీవోల ప్రతులను ఈ వెబ్ నుంచి పొందవచ్చు.: www.goir.ap.gov.in రాస్ట్రప్రభుత్వం: www.apic.gov.in కేంద్ర ప్రభుత్వం: www.cic.gov.in.ఇది కేవలం కేంద్ర ప్రభ్యుత్వ కార్యాలయాలలో సమాచారం కోసమే. తెలుగులో సమాచారచట్టం మరియి దారకాస్తు ఫారాలకోసం: www.rti.eenadu.net అందుబాటులో వున్నాయి.ఆఫీసులకు వెళ్ళలేనివాళ్ళు అంతర్జాలంలో సమాచారాన్ని దీనిద్వారా పొందవచ్చు.www.rtionline.gov.in. దరకాస్తుదారు ఏఅఫిస్నుంచైనా తనకవసరమైన సమాచారాన్ని 30 రోజులలోపు పొందవచ్చు. 

గడువులోగా సమాచారం రానియెడల ప్రజాసమాచార (P.I.O) అధికారికి రు.10/- రుసుం చెల్లించి ధరకాస్తు చేసి 30 రోజులలోపు సమాచారం పొందవచ్చు. ఫీజు ఆఫీస్లో చెల్లించి రశీదు పొందవచ్చు. లేదా పోస్టల్ ఆర్డర్ పోస్టాఫీసులో కొని జతపర్చాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ దరకాస్తునకు అంటించాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ కేంద్రప్రభుత్వ కార్యాలయాలల్లో చెల్లదు. 30 రోజులలోపు సమాధానం రానియెడల రాస్ట్రసమాచార కమిషన్ కు దరఖాస్తుచేస్తూ తను ఇంతకుముందు సమర్పించిన దరఖాస్తు నకళ్ళను జతపత్చవలెను. 

ప్రభుత్వంనుంచి లబ్ది పొడుతున్న జాతీయ పార్టీలకు కూడా ప్రభుత్వ సంస్తల్లంటివేనని, సమాచార హక్కుచట్టం వాటికి వర్తిస్తుందని జాతీయ సమాచార కమిషన్ తీర్పుయిచ్చింది. 



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment