చక్కిలిగింతలు పెడితే నవ్వు ఎందుకు వస్తుంది ?


మన శరీరంలో ఎన్నో అవయవాలు, అవ యవ భాగాలు ఉన్నా, అందులో కొన్ని చాలా సున్నితమైనవి వుంటాయి. ఆ భాగాల్లో ప్రాణప్రదమైనవి, జీవానికి చాలా విశిష్టమైన అంతర్భాగాలు ఉంటాయి. ఉదాహరణకు చంకల కింది భాగంలో ఉన్న ఉరఃపంజరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందులోనే జీవానికి అతి ముఖ్యమైన ఊపిరితిత్తులు, గుండె లాంటి భాగాలు ఉంటాయి. 

అలాగే మెడ భాగంలో మెదడుకు, శరీ రానికి అనుసంధానమైన నాడులు, రక్తనాళాలు, శ్వాస నాళం, ఆహార వాహికలాంటి కీలక భాగాలు ఉంటాయి. ఇలాంటి ముఖ్యమైన అవయవాలుండే భాగాల్లో బయట నుంచి ఎలాంటి స్పర్శ, లేదా వత్తిడి కలిగినా దానికి వెంటనే స్పందించి, నిరోధించే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఆయా భాగాల్లో నాడీతంత్రులు బాగా విస్తారంగా ఉంటాయి. 

అందువల్లనే ఇతరులు ముట్టుకోగానే కితకితల రూపంలో మెదడుకు సందే శాలు అందుతాయి. ఆ స్పర్శ, ఒత్తిడులను నివారిం చేందుకు మెదడు మన శరీరాన్ని పురికొల్పుతుంది. అందువల్లనే మనం చటు క్కున నవ్వుతూ తప్పించు కోడానికి ప్రయత్నిస్తాం.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment