దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి ...?




దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి ...? కోసం చిత్ర ఫలితం


వివరణ :  1 
ఆయా ప్రాచీన సంస్కృతులు చాలా వాటిలో కూడా స్త్రీలస్వామ్యమూ సంభోగ స్వేచ్ఛా, దేవతారాధనకు సంభోగమే ముఖ్యసాధన అన్న అభిప్రాయమూ - ఇవి స్ఫుటంగా కనిపిస్తాయి. దేవాలయాలు ఆ విధంగా క్రీడా మందిరాలుగా ఉండేవని లిఖిత పూర్వకమైన లెక్కలు ఉన్నాయి. సంభోగము పవిత్రమైన దైవభక్తికి సూచన. దానిని జరపని వారు పావులు అన్న మాట.
ఆ రోజుల్లో దేవుడిని పురుష భాగంగా భావించేవారు. దేవుడనేది ఒక గొప్ప పురుషాంగం. ఆ పురుష భాగమే మన దేవతానామాలతో లింగం అయింది. ఆ స్త్రీ భాగమే పానవట్టం అంటున్నాం. ఇవి ముద్దుపేర్లు. వీటి ఆకారాన్ని బట్టి ఆ రెండూ ఏమిటో తెలియనే తెలుస్తూ ఉంది.
పూజలకి మూలాధారాలు జగన్నాథంలో చూడండి. వస్తూ వస్తూ రథం ఆగిపోతుంది. ఇకను చెలరేగుతాయి తిట్లు. ఆ సమయంలో తిట్టనివాడు పాపాత్ముడే అనుకునేవారు. పిండి వంటలు చేసుకున్నా, ఈ భూతు బుద్ధి తప్పదు. స్త్రీ అవయవాల్లాగా, పురుష అవయవాల్లాగా పిండివంటలు, మిఠాయిలు తయారు చేసుకుంటారు. వాళ్లలో వాళ్లు పంచుకుంటారు. దేవతలకు సమర్పిస్తారు. తింటారు. అలా పంచినందువల్లా, దేవతలకు సమర్పించినందువల్లా, ఆ స్త్రీ అవయవాలకు అంటిపెట్టుకొని ఉండే దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం. ఇప్పటికీ మనలో ఆడపిల్లలు సమర్త అయినప్పుడు చిమ్మిలి దంచి స్త్రీ అవయవాల రూపంలో చేసి అవయవ దోష పరిహారార్థం ఇతరులకు పంచి పెట్టడం ఆచారం.


వివరణ :  2
మన ప్రాచీన దేవాలయాల మీద శృంగార భంగిమలలో శిల్పాలను ఎందుకు చెక్కే వారు?
ప్రతి నిత్యమూ దేవాలయానికి వెళుతూ దైవ ధ్యానంలో పడి సృష్టి కార్యాన్ని విస్మరించకూడదన్న హెచ్చరిక చేయడానికే ప్రాచీన దేవాలయాల మీద శృంగార భంగిమలలో శిల్పాలను చెక్కించెవారు మన పూర్వీకులు.
ఈనాటి మన నిత్య జీవితంలో ఉండే వేగం; పూర్వీకులకు ఉండేది కాదు. నిశ్చలంగా, నిబ్బరంగా ఉండేవారు. చాలామంది ప్రతి రోజు ఆలయానికి వెళ్లి వస్తూ ఉండే వారు. పెద్ద వాళ్ళతో పాటుగా యుక్త వయస్సులో ఉండే వారు కూడా వెళ్లి రావడం పరిపాటి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష అనే చతుర్విధములైన పురుషార్ధాలను ప్రతి పురుషుడు సాధించాలి అనే నియమం ఉండేది. 
మొదటి పురుషార్ధమైన ధర్మం గురించి.... పురుషుడు ధర్మ సాధన చేయాలి; అంటే చదువుకోవటం కాని, వృత్తి విద్య నేర్చుకోవడం కాని చేయాలి. 
రెండవ పురుషార్ధమైన అర్ధం( ధనం) గురించి: తాను, తన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనంత ధనం పురుషుడు సంపాదించాలి.
మూడవ పురుషార్ధమైన కామం గురించి.... పురుషుడు వివాహం చేసుకొని గృహస్తు ధర్మాలను పాటిస్తూ ఎక్కువ సంతానం కనాలి.. 
నాలుగవ పురుషార్ధమైన మోక్షం గురించి.... జీవిత చరమాంకం లో మోక్ష మార్గాలను అనుసరించి ముక్తి పొందాలి.
ఈ విధమైన నాలుగు పురుషార్ధాలలో శృంగారానికి (కామానికి ) సముచిత స్థానం కల్పించారు మన పూర్వులు...
పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది... ఎక్కువ సంతానం ఉన్నవారికి సంఘం లో గౌరవం, పలుకుబడి ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో యువకులకు సంతృప్తికరమైన లైంగిక జీవితం లభించేది కాదు; ఎక్కువ మంది యువకులు దేవాలయలలోనే నిద్ర పోయేవారు, వారిలోని లైంగిక ప్రవృత్తిని పెంచడానికి దేవాలయాలపై ఈవిధమైన శిల్పాలు చెక్కించెవారు..... అని అనుకోవాలి... ఆలయాలకు సంభందించిన ఉత్సవాలను వూరి ప్రజలు అంతా కలసి ఆనందం గా జరుపుకొనేవారు.
నాలుగవ పురుషార్ధమైన మోక్షం సాధించాలంటే; మొదటి మూడు పురుషార్ధాలైన ధర్మ, అర్ధ, కామ పురుషార్ధాలను తెలుసుకొని జయించ గలిగి ఉండాలి... అని చెప్పడానికి
కామి గాక మోక్షగామి కాడు.. అని తెలియ చెప్పడానికి ఆలయాలపై ఈ విధమైన శిల్పాలను చెక్కించే వారు.

కష్టాలు తీర్చే మొక్కలు

యంత్రాలతో ప్రయోజనమేనా?

యాగాలు ఎన్ని రకాలు ?

 తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?

 ఆంజనేయునికి ఇష్టమైన పర్వదినాలు ఏవి?

యంత్రాలతో ప్రయోజనం ఉందా లేదా ?

 
నవ గ్రహ ప్రదక్షిణతో దోష నివారణ ?































0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment