అగ్గిపెట్టెలు ఎలా తయారు చేస్తారు? - మీకు తెలుసా?



అగ్గిపెట్టెలు కోసం చిత్ర ఫలితం

అగ్గిపెట్టెల పరిశ్రమలో ఎర్ర భాస్వరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అగ్గిపెట్టెలు లూసిఫర్‌ లేదా రాపిడి, సేఫ్టీ మేచెస్‌ అని రెండు రకాలు. లూసిఫర్‌ అగ్గిపుల్లలు గరుకుగా ఉన్న ఏ ప్రదేశంలో రాపిడి చేసినా మంట పుడుతుంది. 8 సెంటీమీర్ల పొడవు, 0.3 సెంటీమీటర్ల వ్యాసం గల కర్రపుల్ల కొనకు ఎరుపు, తెలుపు లేదా నీలం, తెలుపు రంగులో మండే పదార్థం ఉంటుంది. పుల్ల నాలుగో వంతు భాగాన్ని కరిగిన భాస్వరం లేదా పారఫిన్‌వాక్స్‌లో ముంచుతారు. చిన్నటి తెల్ల కొన ఫాస్ఫరస్‌ టై సల్ఫైడ్‌తో తయారయి ఉంటుంది. ఆంటీమొని ట్రై సల్ఫైడ్‌, పొటాషియం క్లోరైడ్‌, సిలాకా పౌడర్‌, జిగురు ఉంటాయి.

తెల్లటి కొన అంటుకున్నప్పుడు మాత్రమే ఎర్రటి లేదా నీలపు భాగం మండుతుంది. తర్వాత మంట పుల్లకు చేరుతుంది. అలా పుల్లలను యంత్రాల ద్వారా తయారు చేస్తారు. అయితే ఏ మాత్రం రాపిడి కలిగినా ఇవి మండిపోతాయి. కాబట్టి వీటి వినియోగం తగ్గిపోయింది. ప్రస్తుతం సేఫ్టి అగ్గిపుల్లలే తయారవుతున్నాయి. ఈ పుల్లలు కోసం ప్రత్యేకించి చేసిన ఉపకరణాలపై రాపిడి చేసినప్పుడు మాత్రమే మండుతాయి. అలాంటి ఉపకరణాలు అగ్గిపెట్టెకు రెండు పక్కలా అతికించి ఉంటాయి. 

అగ్గిపుల్లలు తయారీకి ముందు చెప్పిన మందులతోనే తయారు చేస్తారు. కానీ ఇందులో ఫాస్ఫరస్‌ ఉండదు. దానికి బదులుగా ఎర్ర భాస్వరాన్ని వాడతారు. 1827లో ఆంగ్లేయ రసాయన శాస్త్రవేత్త జాన్‌ వాకర్‌ అగ్గిపుల్లను తయారు చేశాడు. తయారీకి ఆంటీమొనీ సల్ఫైడ్‌, పొటాషియం క్లోరైడ్‌, గమ్‌ ఆర్భిక్‌ స్టార్చ్‌ను ఉపయోగించాడు. తర్తా మొదట సేప్టీ మేచెస్‌ను 1844లో స్వీడన్‌ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త గుస్టేవ్‌ ఇపాచ్‌ తయారు చేశాడు.









కష్టాలు తీర్చే మొక్కలు

యంత్రాలతో ప్రయోజనమేనా?

యాగాలు ఎన్ని రకాలు ?

 తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?

 ఆంజనేయునికి ఇష్టమైన పర్వదినాలు ఏవి?

యంత్రాలతో ప్రయోజనం ఉందా లేదా ?

 
నవ గ్రహ ప్రదక్షిణతో దోష నివారణ ?

మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోండి

చెవులు ఎందుకు కుట్టించుకుంటారు ?

తలస్నానం ఏరోజు చేయాలి?

కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?

ప్రకృతి విపతులు జంతువులకు ముందే తెలుసా?



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment