మొగలి పూలతో వస్త్రాలు


మొగలి పూల కోసం చిత్ర ఫలితం
ఘాటైన, మత్తెక్కించే సువాసనతో ఉండే మొగలిపూలు నిజానికి మగవి. తెల్లని లేదా లేత గోధుమవర్ణంలో ఉండే ఈ పూలతో అత్తరు, అలంకరణ సామగ్రి తయారు చేస్తారని చాలామందికి తెలుసు, కానీ...వీటి రేకులతో వస్త్రాలు తయారు చేస్తారని చాలామందికి తెలియదు. 

ముఖ్యంగా హవాయి ప్రాంతంలో ఇదో పెద్ద పరిశ్రమ. ఈ పూల రేకులను ఆరబెట్టి, చదునుగా చేసి, నూలు వడికి, రంగులద్ది దుస్తులు తయారు చేస్తారు. హవాయి భాషలో వీటిని అహుహినానో వస్త్రాలుగా పిలుస్తారు. నిజానికి మొగలిపొదల్లో పనికిరాని భాగమంటూ ఏదీ లేదు. 

వీటి ఆకులు, కాండంలోని పీచుతో ఎన్నో వస్తువులు తయారు చేస్తారు. ఇళ్లనిర్మాణానికి వీటి కాండాన్ని వాడతారు. వీటి ఆకులతో చేసిన దొనె్నల్లో వంట చేస్తారుకూడా.

మొగలి పువ్వు మంచి సుగంధంతో గల చిన్న ఏకలింగాశ్రయ వృక్షం. కొనభాగం సన్నగా పొడిగించబడి కంటకయుతమైన ఉపాంతంతో కత్తి ఆకారం (Ensiformis) లోని సరళపత్రాలు. అగ్రస్థ స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో అమరి ఉన్న సువాసన గల మీగడ రంగు పుష్పాలు. మొగలి ఒక విభిన్నమైన సువాసననిచ్చే పూల మొక్క. హిందీలో దీనిని కేవడా లేదా కేతకీ అంటారు









0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment