కొబ్బరికాయ కొట్టే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మీకు తెలుసా?




ప్రాచీన కాలంలో దేవుళ్లకు జంతు బలులు ఇచ్చేవారు. ఇది కాలక్రమంలో గతించింది. తర్వాతి కాలంలో జంతు బలుల స్థానంలో కొబ్బరికాయ కొట్టే ఆచారం మొదలైంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, కొత్త వాహనాల కొనుగోలు, భవనాలు, వంతెనలు లేదా మరే పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలకు భూమి పూజ చేసే ముందు.. వాటిని ప్రారంభించేముందు కొబ్బరికాయను కొట్టడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భగవత్ ఆరాధన సందర్భంగా నీటి కలశంపై కొబ్బరికాయ ఉంచడం సంప్రదాయంగా మారింది. 

కొబ్బరికాయ మానవుని శిరస్సును పోలి ఉంటుంది. కనుక దాన్ని కొట్టడమంటే మన అహాన్ని బద్ధలుకొట్టినట్టేననే అర్థం స్ఫురిస్తుంది. కొబ్బరికాయలోని నీళ్లు మనలోని అంతర్గత వైఖరులకు, అందులోని తెల్లని కొబ్బరి మన మనస్సుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటే వీటన్నింటినీ భగవంతుడికి అర్పిస్తున్నామన్నమాట. 

భగవంతుడి స్పర్శతో పవిత్రమైన మనస్సు ప్రసాదమవుతుంది. కొబ్బరిచెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనదే. అంటే స్వార్థంలేని సేవకు సైతం కొబ్బరికాయ ప్రాతినిధ్యం వహిస్తుంది. కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు శివుడికి ప్రాతినిధ్యాలు. అవి మన కోరికల్ని తీరుస్తాయని చెపుతున్నారు.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment