మెయిల్ ఐడీ తెలియకపోయినా మెసేజ్ పంపే యాప్...!


NoMyID… భారత దేశలోనే రూపొందిన యాప్. ఇది ప్రపంచంలో మారుమూల ఉన్న ఏ మొబైల్ నెంబర్ కైనా ఈ-మెయిల్ పంపే అవకాశమున్న యాప్ ఇది. ఈ-మెయిల్ ఐడీలు తెలియకపోయినా తమ ఫోన్ బుక్ నుంచి సందేశాలు పంపే వీలుంటుంది.తక్షణ సందేశాల్లో అవకాశం లేని డాక్యుమెంట్లు, భారీ స్థాయి సమాచారాన్ని కూడా ఇందులో పంపే వీలుంది. వాణిజ్య పరంగా బ్యాంకులకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఖాతాదారుల ఫోన్ నెంబర్లు మాత్రమే నమోదై.. ఈ-మెయిల్ ఐడీ బ్యాంకులో నమోదు కాని సందర్భాల్లో ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లో పంపే బ్యాంక్ ప్రోత్సాహకాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా బట్వాడా చేసే వీలుంటుంది.





ఆండ్రాయిడ్ మరియు ఐఎఎస్ ఫ్లాట్ ఫాంపై ఈ యాప్ అందుబాటులో ఉంది.ఉచితంగా డౌన్ లోడ్ చేసి వాడుకోవచ్చు. యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత తమ ఫోన్లోకి అమర్చుకోవచ్చు. యూజర్ నేమ్ ఎంపిక చేసి, నమోదైన తర్వాత ఏ మొబైల్ నెంబర్‌కైనా మెయిల్స్ పంపే, స్వీకరించే వీలుంటుంది. వారితో ఛాటింగ్ కూడా చేసుకోవచ్చు..


యూజర్ ఒక సారి తన సంచాలకుడికి మెయిల్ పంపిన వెంటనే ‘nomyid.com’ డొమెయిన్‌లో అది ఈ-మెయిల్ గా మారిపోతుంది. గ్రహీత నెంబర్‌కు మెయిల్ పంపుతుంది. గ్రహీత ఈ యాప్ వినియోగించని వ్యక్తి అయితే వారికి ఎస్ఎంఎస్ వస్తుంది. అప్పుడు యాప్ డౌన్ లోడ్ చేసుకుని వెబ్ మెయిల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.


ఇతర లక్షణాలు

యూజర్ మొబైల్ నెంబర్ ప్రత్యేకమైనది. అదే ఈ-మెయిల్ ఐడీగా ఉపయోగపడుతుంది.

ఈ-మెయిల్ ద్వారా యూజర్ ఎలాంటి డాక్యుమెంట్‌నైనా పంపే వీలుంది. స్వీకరించే అవకాశమూ ఉంది.

సందేశాలు, ఇమేజ్ లు , వీడియోలను యూజర్లు ఎక్కడ నుంచైనా ఎక్కడికైనా పంపే వీలుంది. లైవ్ ఛాటింగ్‌ వెసులుబాటుంది. 

ఈ ప్లాట్‌ఫాంలో మొబైల్ నెంబర్‌ను వాడుతున్నందున మోసాలకు అవకాశం తక్కువగా ఉంది.ఇదీ నమ్మకమైన, సురక్షితమైన ఫ్లాట్‌ఫాం అని NoMyID చెప్పుకుంటోంది.




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment