మనిషి ఎందుకు చనిపోతాడు ?

ఓ పురుగు, పుట్ర, ఓ జీవి, ఓ పక్షి, ఓ బల్లి, ఓ మనిషి ఎందుకు పుడతాయో, ఎలా పుట్టాయో అన్న ప్రశ్నలకు ఆ గ్రంథాల్లో సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయా కాలాల్లో ఆ సమాచారానికి సంబంధించిన సంపూర్ణ వైజ్ఞానిక సమాచారం తెలియదు. విజ్ఞానశాస్త్రానికి చరిత్ర ఉంది. మానవచరిత్రతో అది విడదీయరాని సంధానంతో నడిచింది. మానవ సమాజానికి ఆవల విజ్ఞానం లేదు. ఇక అసలు విషయానికి వస్తాను. మనిషేకాదు; ప్రాణం పోసుకున్న ఏ జీవి అయినా ఏదో ఒక సమయంలో చనిపోవాల్సిందే! ఆధునిక విజ్ఞానశాస్త్రంలో అందుకు లోతైన సమాధానంతో వివరణ ఉంది.

జీవి ఎదిగే క్రమంలో ప్రకృతి నియమాల్ని ఎదిరించే ధోరణి ఎక్కువ, జీవి అవసానదశకు చేరే సమయంలో ఇదే ధోరణి అణుకువ గాను ఉంటాయి. ఈ అసమతుల్యం జీవి పుట్టిన సమయం నుంచి గిట్టేంతవరకు పరిమాణాత్మకంగా పెరుగుతూ మరణం అనే గుణాత్మక మార్పునకు తావిస్తుంది. దీన్నే మనం గతితార్కిక భౌతికవాదంలో రెండవ నియమంగా పేర్కొంటాము. అయితే ణచీA లోని చైతన్యధోరణి ప్రకృతిని పరిశీలించి తన అస్తిత్వాన్ని మరింత పటిష్టపరిచేందుకు వివిధ రూపాల్లోకి పరిణామం చెందుతుంది. 

మనిషి లేదా ఇతర ఏ జీవి అయినా పెరుగుతుందిగానీ ఇక ఎన్నడూ మళ్ళీ బాల్యంవైపు వెళ్లలేం. ఓ చెట్టు మొగ్గ స్థాయి నుంచి చెట్టుగా ఎదుగుతుంది గానీ ఎంత కష్టపడ్డా ఆ చెట్టు తనంత తానుగా తిరిగి చిన్న మొక్క కాలేదు. కర్రలు, బొగ్గు, చక్కెర వంటివి మండితే కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి, వేడి వస్తాయిగానీ కార్బన్‌ డై ఆక్సైడును, నీటి ఆవిరిని కలిపి వేడి చేస్తే కర్రలు, బొగ్గులు, చక్కెరలు రావు. కానీ జీవుల్లో ఈ సూత్రానికి విరుద్ధంగా కార్యకలాపాలు తాత్కాలికంగానయినా జరుగుతాయి. 

 ప్రకృతిని సమర్ధవంతంగా ఎదుర్కొనే అంతర్నిర్మాణం పరిణమించిన కొన్ని జీవులు ఎక్కువకాలం బతుకుతాయి. కానీ వాటి జీవితంలో వైవిధ్యంగానీ, తమాషా గానీ ఉండదు. ఉదాహరణకు తాబేలు రెండుమూడొందల సంవత్సరాలు బతుకుతుంది. కొన్ని వృక్షాలు వేల సంవత్సరాల పాటు బతుకుతాయి. కానీ ఓ దోమలో ఉన్న వైవిధ్యం కూడా వాటిలో ఉండదు. ఓ పుష్పించే చెట్టులోని తమాషా వాటిలో ఉండదు. మనిషి పరిణామక్రమంలో అగ్రస్థానాన ఉన్నాడు. ప్రకృతిని ఎదిరించగల సత్తా నేర్చుకున్నాడు. అందుకే వందేళ్లు బతగ్గలుగుతున్నాడు. కానీ ఆత్మ అంటూ ఏమీ లేని, మానవాతీత శక్తి ఏదీ లేని ప్రకృతిలో అంతర్భాగంగానే ఉన్న మనిషి, తదితర అన్ని జీవులు ప్రకృతి ధర్మాల్లో అంతర్భాగం కావాల్సిందే. మరణం ప్రకృతికి యిష్టమైన సహజత్వం, దీర్ఘకాలికం. జీవం ప్రకృతి విరుద్ధం, తాత్కాలికం. అందుకే దీర్ఘకాలిక ప్రకృతిలో మరణం అంతర్భాగం.

బతుకుబండి చక్రాలు ఏదో ఒక రోజు అరిగిపోతాయి లేదా విరిగిపోతాయి. ఆ బండి అక్కడ కుప్పకూలక మానదు. చిరంజీవులు అంటూ ఎవరూ లేరు, ఎప్పుడూ లేరు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment