తిరుమలలో మొట్టమొదటి లడ్డును ఎప్పుడు తయారు చేశారు? మీకు తెలుసా?


tirumala కోసం చిత్ర ఫలితం
తిరుపతి శ్రీవారి లడ్డూ అంటే ఇష్టపడని వారు ఉండరూ. దానికున్న ప్రత్యేకతే వేరు. మరి అంతమంది ఇష్టపడే ఈ లడ్డూ తయారీ ఇప్పటికీ 300 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ లడ్డూను మొదట ఆగష్ట్ 2, 1715 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరునికి ప్రసాదంగా తయారుచేసినట్టు అధికారులు తెలిపారు. 

tirumala laddu కోసం చిత్ర ఫలితం
తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యదిక సంపద కలిగిన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఎంత ఫేమస్సో లడ్డూ కూడా అంతే ఫేమస్సు. ఈ ఆలయానికి ఎక్కడెక్కడినుండో జనాలు వస్తుంటారు. ధన, పేద అనే తేడా లేకుండా అందరూ ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ లడ్డూలను ప్రసాదంగా అందిస్తారు. 

300 గ్రాముల బరువున్న ఈ లడ్డూను రూ. 25 ధరపై విక్రయిస్తారు. సబ్సిడీ కింద ఈ లడ్డూను రూ. 10కే విక్రయిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్ధానం లెక్కల ప్రకారం 2014లో మొత్తం 9 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment