వైట్‌హౌస్‌ కు ఆ పేరు ఎలా వచ్చింది?

వైట్‌హౌస్‌ అమెరికా అధ్యక్షుడు నివసించే ప్రభుత్వ నివాసం. ఇది వాషింగ్టన్‌ డి సి నగరంలో ఉంది. ఐర్లండ్‌కు చెందిన జేమ్స్‌ హూబన్‌ అనే ఇంజనీర్‌ రూపకల్పనలో అక్టోబర్‌ 13, 1792న దీని నిర్మాణం ప్రారంభించి, 1800 సంవత్సరం నాటికి పూర్తిచేశారు. 
white house కోసం చిత్ర ఫలితం
దీనిని గచ్చకాయ రంగు రాళ్ళతో నిర్మించారు. అప్పటి నుండి ఇది అమెరికా రాష్ట్రపతి అధ్యక్షుని నివాసగృహం అయింది. ఆగస్టు 24, 1814న జరిగిన యుద్ధంలో బ్రటిష్‌ సైన్యం ఈ భవంతిని తగులబెట్టింది. భవనంలో కొద్ది భాగం మాత్రమే మిగిలింది. హూబన్స్‌ పర్యవేక్షణలోనే మరల దీనిని 1817లో పునర్నిర్మిం చారు. 

పొగమరకలు కనబడకుండా గోడలకు తెల్లరుంగు వేశారు. అప్పటి నుండి దీనిని వైట్‌హౌస్‌ అని పిలవసాగారు. 1902లో అప్పటికే అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ వైట్‌హౌస్‌గా ఈ భవంతికి పేరును అధికారికంగా నామకరణం చేశాడు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment