ట్యూబుల్లేని టైర్లు ఎప్పటి నుండి ఉన్నాయి?


టైరు అనేది ఒక చక్రాన్ని ఆవరించి ఉంటూ, ఆ చక్రానికి తగిన రక్షణను కల్పించడం,
 దాని పనితీరుని పెంపొందించడం అనే పనులను చేస్తుంది. మొదట్లో టైర్లను 
తోళ్ళు, చెక్క వంటి వాటితో చేసేవారు. 

క్రీ.శ.1844లో చార్లెస్‌ గుడియర్‌ అనే శాస్త్ర వేత్త రబ్బర్‌ని 'వల్కనైజ్‌' చేసే పద్ధతిని
 కనుగొన్నాక రబ్బరు టైర్లు వాడుకలోకి వచ్చి, ప్రపంచ రవాణా రంగంలో ఓ సరికొత్త 
విప్ల వం మొదలైంది. 

ఆ తరువాత 1888లో జాన్‌ డన్‌లప్‌ అనే శాస్త్రవేత్త ట్యూబులతో ఉండే టైర్లను 
కనుగొన్నాడు. ఈ పద్ధతిలో చక్రాన్ని ఆవరించి ఉండే టైరు లోపల ఒక మెత్తని ట్యూబు 
(గొట్టం) ఉంటుంది. దీనిలో గాలిని నింపుతారు. 

ఈ తరహా టైర్ల ను అమర్చిన చక్రాలు చాలా సులభంగా, వేగంగా ప్రయోణించగల్గడంతో 
అతి తక్కువ కాలంలోనే ఇవి బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి. కేవలం సైకిళ్ళ కోసమేగాక, 
అనేక ఇతర వాహనాలకు కూడా గాలితో నింపబడే ట్యూబులుండే టైర్లను వాడటం
మొదలుపెట్టారు.
Image result for tubeless tyres
తొలిసారిగా 1954లో ట్యూబుల్లేని టైర్లను వాడటం మొదలుపెట్టారు. ఈ టైర్లలో ట్యూబులు 
ఉండవన్న మాటేగాని, గాలి మాత్రం నింపబడుతుంది. లోపలి గాలి బయటికి పోకుండానూ, 
బయటి గాలి లోపలికి రాకుండానూ ఈ తరహా టైర్లలో పటిష్టమైన ఏర్పాట్లు ఉంటాయి.

 ఇలాంటి టైర్లకు కూడా అప్పుడప్పుడూ పంక్చర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అలా 
పంక్చర్‌ అయినప్పుడు ఇలాంటి టైర్లలోని గాలి కేవలం ఒక రంధ్రం గుండా, సాఫీగా, వేగంగా బయటకుపోతుంది. దీనికి భిన్నంగా మామూలు టైర్లకు పంక్చర్‌ అయి నప్పుడు, వాటిలోని ట్యూబులు బెలూన్‌ల లాగా ఢామ్మని పగలడం జరుగుతుంది.

ఇంకా చదవండి:
నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభప్రధం అవుతుంది
మంత్ర శక్తికి మహిమ ఉంటుందా ?
ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉండాలి?
ఇంటి ఓనర్స్ పైన ఉండాలా? కింద ఉండాలా?
అద్దె ఇళ్ళకు వాస్తు చూడాలా?
ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు
భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు
భారత దేశం ఉనికి - సరిహద్దు రేఖలు
భారత కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత మంత్రి మండలి