జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?



భూమి మీద నివసించే అన్ని మొక్కలు, జంతువులు ప్రాణాలు నిలుపు కోవడానికి
 నీటిని తాగుతాయి. 

కానీ అమెరి కాలోని వాయువ్య దిశలోని ఎడారిలో ఉండే ఒక రకమైన ఎలుకలు 
ఇందుకు భిన్నం. 

ఇవి వాటి జీవతకాలంలో ఒక్కసారికూడా నీళ్ళు తాగవు. ఈ రకమైన ఎలుకల 
జాతిని 'కంగారూ ఎలుక' అంటారు. 

ఇవి ఒక్క ఆస్ట్రేలియాలోనే లభించే కంగారూలను పోలి ఉండి, వాటిలాగే పొడుగైన 
కాళ్ళతో ఎగురుతూ నడుస్తాయి. 

కనుక వీటికి ఆ పేరు వచ్చింది. నీరు తాగకుండా బతకడమనే సౌలభ్యం ఈ జీవుల
 భౌతిక నిర్మాణంలోనే ఉంది. 

ఇవి ఎడారి మొక్కలను, గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి.

 వీటికి కావలసిన ఆహారం గానీ, నీరు గానీ ఈ మొక్కల నుంచే లభిస్తాయి. 

ఈ ఎలుకలు పొదల దగ్గర నేలలో బొరియలు చేసుకొని నివసిస్తాయి.

ఇంకా :
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
పెద్దబాల శిక్ష బుక్ 



జనరల్ సైన్స్
రక్తనాళాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ?
మీకు తెలుసా ?
జనరల్‌ అవేర్‌నెస్‌