భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు?


సగటు మనిషి శరీరంలో సుమారు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. 

ఇది శరీరంలోని విభిన్న భాగాలకు సరఫరా అవుతుంది. ఆయా భాగాలకు ఇంతింత 
రక్తం వెళ్ళాలని నియమం లేదు.

వివిధ కణాల అవసరాన్ని బట్టి రక్తం ఆయా భాగాలకు వెడు తుంది. 

సాధారణ సమ యాల్లో కాలేయానికి గుండె నుండి వచ్చే రక్తం 28 శాతం వెడుతుంది. 

మూత్రపిండాలకు 28 శాతం, కండరాలకు 15 శాతం, మెదడుకు 14 శాతం, 
గుండెకు 5 శాతం రక్తం వెడుతుంది. 

ఆయా శరీర భాగాల అవసరాన్ని బట్టి రక్త ప్రవాహం మారుతూ ఉంటుంది

ఆహారం తీనుకున్నప్పుడు అది జీర్ణం కావడానికి ఉదర భాగానికి ఎక్కువ రక్తం అవసరం.

 అంచేత భోజనం తర్వాత ఎక్కువ రక్తం ఉదర భాగానికి చేరుతుంది. 

దీని వల్ల మెదడులో రక్త శాతం తగ్గుతుంది. దాంతో మెదడు కాస్త మందగిస్తుంది.

ఈ కారణం వల్ల మనకు నిద్ర మత్తు కలుగుతుంది. 

నిజానికి శరీరానికి విశ్రాంతి కావాలని చెప్పే సంజ్ఞేయే నిద్ర మత్తు.