ప్రపంచంలో అతిచిన్న తేనెటీగలు ఎక్కడ ఉన్నాయి ?


ఈ ప్రపంచంపై  దాదాపుగా 20,000 జాతుల తేనెటీగలు నివసిస్తున్నాయి. తేనెపుట్ట లోనే చిన్న 
చిన్న గూడులుగా చేసుకొని సమైక్యంలోని భిన్నత్వంగా జీవనాన్ని సాగిస్తాయి

వాలెస్‌ ప్రాంతంలో ఉండే తేనెటీగలే అన్నిటికైనా బలమైనవి మరియు పెద్దవి. ఇవి ఒకొక్కటి
 4.సెం.మీ. ఉంటాయి. వీటిని మొట్టమొదటి సారిగా ఇండోనేషియాలో 1858లో కనిపెట్టారు. 

ప్రపంచంలో అతిచిన్న తేనెటీగలు బ్రెజిల్‌ లోనివి వీటిని ట్రోగోనా డకైగా పిలుస్తారు. ఇది దాదాపు 
 2 నుంచి 5మి.మి. పొడవును కలిగి ఉంటాయి. పరిశీలనగా చూస్తే కాని ఇవి మనిషి కంటికి 
వెంటనే కనపడవు.


తేనెటీగలు మాత్రమే మనుషులు తినగల ఆహారాన్ని తయారు చేయగల కీటకాలు. తేనెటీగలు వాటి
 జాతి అభివృద్ధి మరియు రక్షణ, పెరుగుదల కోసం తేనెను తయారుచేస్తాయి.అంతకష్టపడి తెచ్చిన 
మరియు తయారు చేసుకున్న తేనెను వెంటనే వాడుకోవు.

తేనెటీగలు తేనెని మాత్రమే కాకుండా కొవ్వునికూడా తయారు చేస్తాయి.

అది మనం సాధారణంగా కొవ్వుత్తులను తయారు చేయడానికి మరియు కుర్చీలను, బెంచీలను
పాలిష్‌ చేయడానికి ఉపయోగిస్తారు. 

ఒక తేనెపట్టు తయారు అయింది అంటే దానికోసం దాదాపుగా 50,000 తేనెటీగలు శ్రమిస్తాయని 
అంచనా.  ఇవన్నీ పూవులపై చేరి వాటినుండి పుప్పొడిని సేకరిస్తాయి.

తేనెటీగలు ఒక కిలో తేనెను తయారు చేయడం కోసం సుమారు 50లక్షల పూలనుండి పుప్పొడిని
 సేకరిస్తాయి. ఆ పూల కోసం అవి వెతికే దూరం లెక్కిస్తే దాదాపు 4 సార్లు భూమిని చుట్టి వచ్చిన 
దూరంతో సమానం. ఆడ తేనెటీగలను రాణులుగా పిలుస్తారు. అవి రోజుకు సరాసరి 2 లేదా
 3వేల గుడ్లను పెడతాయి. ఈ విధంగా అవి దాదాపు 2లక్షల గుడ్లను సంవత్సరానికి 
పెట్టగలవు. అలాగే అవి ఐదు సం||నివశిస్తాయి.

అందువలన ఒక ఆడతేనెటీగ మిలియన్ల కొద్దీ తేనెటీగలను సృఫ్టించగలవు.తేనెటీగలు ఎగిరేటపుడు 
వాటి రెక్కలు నిమిషానికి 11,400 సార్లు కొట్టుకుంటాయి. అందువలనే అవి ఎగిరేటపుడు 
బుజ్‌..అనే శబ్దం వినిపిస్తోంది. 

సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా, కోటి 30లక్షల టన్నుల తేనె తయారు 
చేయబడు తోంది. అందులో ప్రధానంగా చైనాలో అధిక తేనెను తయారు చేస్తోంది. వార్షికానికి 2లక్షల
76 వేల టన్నుల తేనె చైనా ద్వారా లభిస్తోంది.

తేనెటీగలు మనుషులను కుట్టడం ప్రమాదకరం. కొంతమందికి తేనెటీగ కుడితేకళ్లు తిరిగి పడిపోతారు. 

1996లో రోడేషియా ప్రాంతంలోని జోహాన్‌ రెల్లెకి అనే వ్యక్తికి 2,243 సార్లు తేనెటీగలు కుట్టినా కూడా
 అతను ఆనందంగా జీవిస్తున్నాడు.

ఇంకా :
 ప్రపంచంలోని ప్రధాన సరస్సులు
భారత కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత మంత్రి మండలి
భారత రాష్ట్రాల సమాచారం
మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చా ?
సౌర కుటుంబం గురించి మీకు తెలుసా ?
మృత సముద్రం (Dead Sea)గురించి మీకు తెలుసా ?