మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చా ?


ఆ కళ్లు అయస్కాంతాల్లా ఆకట్టుకుంటాయి. ఎక్స్‌రేల్లా పనిచేస్తాయి. 

ఆ చూపుల్లో తీక్షణత ఉంది. ఆ మొహంలోని ఆకర్షణ, ఎదుటి వారిని ప్రభావితం 
చేస్తుంది... లాంటి మాటలు వింటుంటాం. 

నిజమే! కొందరి వ్యక్తుల మొహంలోని ఆకర్షణశక్తితోపాటు వారి తెలివితేటలు కూడా 
మొహంలో ప్రతిఫలిస్తుంటాయి. అలాంటివాళ్లు తాము చెప్పినదానికి ఎదుటివాళ్లని 
తలూపేలా చేయగలరు.

 మొహం చూసి జాతకం చెప్పేయవచ్చని నానుడి ఉంది. ఇటీవల కాలంలో దీన్నే 
ఫేస్‌రీడింగ్‌ అని అంటున్నారు. ఇదంతా నిజమని చెప్పలేం. అయితే ముఖకవళికలకు
 తెలివితేటలకు సంబంధం ఉందని ఇటీవల అమెరికన్‌ మానసికశాస్త్రవేత్తలు తమ 
ప్రయోగాల ద్వారా వెల్లడించారు.

 
             ఏ ఫేస్‌ ఈజ్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ ద మైండ్‌ అంటుంటారు. ఇది అన్ని సందర్భాల్లో, 
అందరికీ వర్తించదు కానీ మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా 
వేయవచ్చన్నది కూడా కరెక్టే. ముఖం వారి భవిష్యత్తుకు కూడా కొలబద్ధగా ఉంటుందని 
అమెరికన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ముఖ సౌందర్యానికి, మెదడుకూ అవినాభావ సంబంధం ఉందని అమెరికాలోని 
బ్రాన్‌డైజ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ లెస్లీ జెబ్రోవిట్జ్‌ ఆధ్వర్యంలో జరిగిన
పరిశోధనల్లో తేలింది. 

ఎదుటివాళ్లని బలంగా ఆకట్టుకోగల వ్యక్తుల్లో ఐ.క్యూ(ఇంటెలిజెన్స్‌ కోషియంట్‌) 
ఎక్కువగా ఉంటుందనీ, వారు తర్వాతి జీవితంలో విజయాలు సాధించే అవకాశాలూ
 ఎక్కువనీ ఈ బృందం పేర్కొంది. అయితే పరిచితులు కాకుండా అపరిచితులైతేనే 
ఐక్యూ శాతాన్ని అంచనావేయగలుగుతారిని వారు అభిప్రాయపడుతున్నారు. 

వ్యక్తిలోని ఆకర్షించే గుణం లేదా ఆకర్షణ అనేది ఆ వ్యక్తి మేధాశక్తిని ఏ విధంగా
 ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని కూడా ప్రయోగపూర్వకంగా పరిశీలించింది.
 అందులో ఆకర్షణీయంగా కనిపించే వ్యక్తుల్లో వయసు పెరిగినప్పటికీ ఐక్యూ పరీక్షల్లో 
మంచి ఫలితాలను సాధించారని తేలింది. 

వ్యక్తుల్లోని వ్యక్తిగత సామర్థ్యాన్ని అంటే తెలివితేటలను వివిధ రకాల పరీక్షల ద్వారా 
అంచనా వేయడంతోపాటు, ఇతరులు వారి ముఖకవళిలకలను పరిశీలించడం ద్వారా
 తెలివితేటల్ని అంచనా వేసినప్పుడు రెండూ ఒకే రకమైన ఫలితాలు వచ్చాయని
పరిశోధకులు తేల్చి చెప్పారు. 

అంతేగాక, అత్యధిక ఆకర్షణశక్తిగల వారు అధిక తెలివితేటల్ని కలిగి, స్ఫూర్తిమంతులై 
ఉంటారని పరిశోధకులు పేర్కొంటున్నారు. 

అంటే ఈ పరిశోధనల ఆధారంగా వ్యక్తు మొహమే వారి జీవితాన్ని నిర్దేశిస్తుందా? 
అనే అనుమానం కలగవచ్చు

ఇంకా :
అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం
ఏపిసెట్‌/నెట్‌ తెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
దేవుడి వద్ద దీపం ఎందుకు పెడతారు ?
దేవాలయంలోని విగ్రహానికి ఎదురుగా నిలబడి ప్రార్ధన చేయరాదా?