కుందేలు చెవులు చాలా పెద్దవిగా ఎందుకుంటాయో మీకు తెలుసా?


         కుచ్చు వంటి జుట్టు కలిగిన చిన్న జంతువు కుందేలు. ఇంతవరకు శాస్త్రజ్ఞులు 
50 రకాల కుందేళ్ల గురించి అధ్యయనం చేశారు. ఈ కుటుంబానికి చెందిన జంతువుల 
శిలాస్థికలు ఉత్తర అమెరికాలో మొట్టమొదట లభించాయి. ఇప్పుడివి ప్రపంచంలోని అన్ని 
దేశాల్లోనూ నివసిస్తున్నాయి. 

శరీరంతో పోలిస్తే కుందేలు చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. 
కుందేలు బలహీనమైన పిరికి జంతువు. దీనికి చుట్టూ అనేక శత్రు జంతువులుంటాయి. 
అందుచేత చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వీటికి వినబడేలా ప్రకృతి వీటికి పెద్ద చెవులను ప్రసాదించింది. 

విశాలమైన బాహ్య చెవి ఎక్కువ శబ్దాలను గ్రహించగలుగుతుంది. గ్రహించిన శబ్దాలను
 లోపలి చెవికి చేరవేస్తుంది. దీనివల్ల శత్రువులను పసిగట్టి దూరంగా పారిపోయి 
ఆత్మ రక్షణ చేసుకోవడానికి వీలవుతుంది. 
అడవి కుందేళ్లు ఎక్కువ పగటి కాలాన్ని కలుగుల్లోనే గడుపుతాయి. సూర్యోదయం వేళ 
లేదా సూర్యాస్తమయం వేళ ఆహారానికి బయలుదేరుతాయి. వీటికి ఘ్రాణశక్తి కూడా ఎక్కువే. 
వెనుక కాళ్లు పొడవుగా ఉంటాయి. వీటివల్ల అవి అతి వేగంగా పరుగెత్తగలవు. 

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఇవి పరుగెడతాయి. ఇవి గడ్డిని ఎక్కువగా తింటాయి.
 దుంపలు, కొన్ని కాయగూరలను కూడా తింటాయి. కుందేలు గర్భం ధరించిన 
40 రోజులకు పిల్లలు పుడతాయి. వీటికి సంతానోత్పత్తిలో ఉన్న ప్రత్యేక గుణం వల్ల 
అనేక శత్రువులున్నా, నేటికీ ఈ జాతి అంతరించిపోకుండా ఉంది.

ఇంకా :

ఏనుగు పిల్ల "తల్లి కడుపు" లో ఎన్ని నెలలు ఉంటుంది ?
పిల్లి చీకట్లో ఎలా చూడగలదు?
మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చా ?
మనిషి ఎప్పుడు చనిపోయాడో లెక్కించే 'సూక్ష్మ' గడియారం!
జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
మూగజీవాలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఎందుకు ?