నికోలా టెస్లా


 
    టెస్లా 1856 జులై 10 న క్రోయేషియాలోని స్మిల్జాన్‌లో జన్మించారు. డ్యూకా, మిలుటిన్ టెస్లా ఆయన తల్లిదండ్రులు. కార్లోవాక్‌లోని హయ్యర్ రియల్ జిమ్నాజియంలో టెస్లా విద్యాభ్యాసం చేశారు.
1875 లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివేందుకు గ్రాజ్‌లోని ఆస్ట్రియన్ పాలిటెక్నిక్‌లో
 చేరారు. తర్వాత ఛార్లెస్ ఫెర్డినాండ్ యూనివర్సిటీలోనూ ఆయన విద్యాభ్యాసం సాగింది.

¤ టెస్లా 1880లో బుడాపెస్ట్‌లోని ఓ టెలిగ్రాఫ్ కంపెనీలో ఇంజినీర్‌గా చేరారు. అక్కడ 
పనిచేస్తున్నప్పుడే 'టెలిఫోన్ రిపీటర్' అనే పరికరం తయారుచేశారు. 1882లో ప్యారిస్
 నగరానికి వెళ్లి అక్కడే పలు పరికరాలు తయారు చేశారు.

¤ 1884లో న్యూయార్క్ పట్టణం చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ 

ఆల్వా ఎడిసన్ దగ్గర పనిచేయడం ఆయన శాస్త్ర జీవితంలో ఓ మలుపుగా చెప్పాలి.
 ఎన్నో వినూత్న పరికరాలకు టెస్లా ఇక్కడే రూపకల్పన చేశారు.

¤ 1886లో సొంతంగా టెస్లా ఎలక్ట్రిక్ లైట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ 

ప్రారంభించి సరికొత్త పరికరాలు ఆవిష్కరించారు.ప్రధాన ఆవిష్కరణ: రేడియో,
 టీవీల్లో ఉపయోగించే హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ వేష్టణం (టెస్లా వేష్టణం) రూపొందించారు.
 భ్రమణం చెందే అయస్కాంత క్షేత్రాల ఆధారంగా పనిచేసే పరికరాలెన్నో ఆయన 
సృష్టించారు. ఇండక్షన్ మోటార్, వైర్‌లెస్ సాంకేతికత, టెస్లా విద్యుత్తు కారు, 
పాలిఫేజ్ సిస్టం ఆఫ్ a.c. పవర్ లాంటివి కనుక్కున్నారు.

అవార్డులు:1893లో ఇలియట్ క్రెసన్ పతకం, 1916లో ఎడిసన్ పతకం, 

1934లో జాన్ స్కాట్ పతకాలు టెస్లా అందుకున్నారు. ఆయన గౌరవార్థం 
శాస్త్రవేత్తలు 'టెస్లాని అయస్కాంత క్షేత్రప్రేరణకు' S.I.   ప్రమాణంగా ప్రతిపాదించారు. 
నికోలా టెస్లా 1943 జనవరి 7న న్యూయార్క్ నగరంలో తన 86వ ఏట తుది మరణించారు.