మెండలీవ్


      మెండలీవ్ 1834 ఫిబ్రవరి 8న సైబీరియాలోని టోబోల్‌స్క్(రష్యా)లో ఇవాన్ మెండలీవ్, మారియా కోర్నిలెవా దంపతులకు జన్మించాడు.¤ స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది.¤ 1850లో పెడగాగిక్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, 1855లో ఉపాధ్యాయుడిగా అర్హత పొందాడు.  
¤ మెండలీవ్ 1857లో మొదటి నియామకం పొందాడు. 1861లో 'ఆర్గానిక్ కెమిస్ట్రీ' అనే పుస్తకాన్ని ప్రచురించాడు.¤ 1864లో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో రసాయన శాస్త్రాచార్యుడిగా నియమితులయ్యారు.¤ 1869లో 'ప్రిన్సిపుల్స్ ఆఫ్ కెమిస్ట్రీ' అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో మూలకాల ఆవర్తన పట్టికకు సంబంధించిన విషయాలను తెలియజేశాడు.¤ మెండలీవ్ అంతవరకూ తెలిసిన మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. ఒకే ధర్మం గల మూలకాలను ఒకే నిలువు వరుసలో ఉంచాడు. ఈ పట్టికను పరిశీలించి మూలకాల ధర్మాలకు, వాటి పరమాణు భారాలకు సంబంధం ఉందని తెలుపుతూ ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించాడు. తాను తయారు చేసిన పట్టికకు ఆవర్తన పట్టిక అని పేరు పెట్టాడు. ఈ పట్టికలో కొన్ని చోట్ల ఖాళీలను ఉంచాడు. ఈ ఖాళీల ఆధారంగా ప్రకృతిలో ఇంకా కనుక్కోవాల్సిన మూలకాలు ఉన్నాయని తెలియజేశాడు.వీటిలో మూడు మూలకాల లక్షణాలను 1870లో తెలియజేశాడు. తర్వాత శాస్త్రవేత్తలు ఈ మూడు మూలకాలను కనుగొన్నారు. వీటి లక్షణాలు మెండలీవ్ తెలియజేసిన మూలకాల లక్షణాలతో దాదాపుగా సరిపోయాయి.¤ మెండలీవ్ 1893లో తూనికలు, కొలతల విభాగానికి అధిపతి అయ్యాడు. 1905లో స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైస్సెస్‌కి సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1907 ఫిబ్రవరి 2న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 72వ ఏట మరణించాడు.

మరికొందరు మహామహులు 

స‌ర్ సి.వి రామ‌న్

సర్ హంఫ్రీడేవి

శ్రీనివాస రామానుజన్

లైనస్ కార్ల్ పౌలింగ్

నీల్స్ బోర్

జాకోబస్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్

హెన్రిక్ రుడాల్ఫ్ హెర్ట్జ్

విలియం గేస్కోయిన్

మైఖేల్ ఫారడే

నికోలా టెస్లా

థామస్ ఆల్వా ఎడిసన్

జొహెనెస్ కెప్లర్

గెలీలియో

క్రిస్టియన్ హైగెన్స్

ఐజక్ న్యూటన్