మైఖేల్ ఫారడే



         మైఖేల్ ఫారడే 1791 సెప్టెంబరు 22 న ఇంగ్లండ్‌లోని న్యూఇంగ్‌టన్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టారు. తండ్రి జేమ్స్ కమ్మరి పనిచేసేవారు. ఫారడే కేవలం ప్రాథమిక విద్య మాత్రమే చదివారు.
చిన్నప్పుడే పుస్తకాలు బైండ్ చేసే షాపులో పనికి కుదరడం వల్ల ఆ షాపులోని ఎన్నో పుస్తకాలు
 చదివే అవకాశం ఆయనకు లభించింది. ఆ పుస్తకపఠనమే విజ్ఞానశాస్త్రంపై ఆయనకు ఎనలేని
 అభిరుచిని కలిగించింది.

జీవితం..       

 1813లో ఈయన ప్రముఖ శాస్త్రవేత్త సర్ హంఫ్రీడేవికి కార్యదర్శిగా, రాయల్ ఇన్‌స్టిట్యూట్
 రసాయనశాలలో సహాయకుడిగా నియమితులయ్యారు. సర్ హంఫ్రీడేవి విదేశీ పర్యటల్లో ఫారడే
 తోడుగా వెళ్లేవారు. విజ్ఞానశాస్త్రానికి సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి 
ఈ పర్యటనలు ఎంతో దోహదపడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలతో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి
 ఫారడే 1824లో రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. రాయల్ ఇన్‌స్టిట్యూషన్‌లో 
తొలి పుల్లేరియన్ రసాయనశాస్త్ర ఆచార్యుడిగా నియమితులయ్యారు. ఐరోపాలోని ప్రముఖ సైన్స్ 
అకాడమీలు కూడా ఆయన్ని తమ సభ్యుడిగా ఎంపిక చేశాయి.

ప్రధాన ఆవిష్కరణ:        ఫారడే విద్యుచ్ఛక్తి మీద ప్రయోగాలు చేశారు. విద్యుదయస్కాంత
 ప్రేరణ నియమాలు ప్రతిపాదించారు. ఎన్నో ప్రయోగాల ద్వారా విద్యుత్తు విశ్లేషణ నియమాలు
 ప్రకటించారు. డయా అయస్కాంత తత్వాన్ని కూడా కనుక్కున్నారు. ధృవణం చెందిన కాంతిని
 భ్రమణం చెందించగల 'రొటేటర్' పరికరాన్ని ఫారడే ఆవిష్కరించారు. ఆయన ప్రతిపాదించిన 
నియమాలు, సూత్రాలు విద్యుత్తు మోటార్, డైనమో రూపొందించేందుకు దోహదపడ్డాయి.

అవార్డులు:        'నైట్‌హుడ్' తో సహా ఫారడేకు ఇంగ్లండ్ ప్రభుత్వం ఇవ్వజూపిన ఎన్నో 
పురస్కారాలను ఆయన వినమ్రంగా తిరస్కరించారు. ఆయన గౌరవార్థం విద్యుత్ కెపాసిటన్స్ 
S.I. ప్రమాణంగా ఫారడేని ప్రతిపాదించారు. బ్రిటిష్ మహారాణి ఆయనకు హంప్టన్ కోర్టు 
సముదాయంలోని ఓ భవంతి కూడా బహుకరించారు. ఫారడే ఈ భవంతిలోనే 1867 ఆగస్టు 
25న కన్నుమూశారు.