హెన్రిక్ రుడాల్ఫ్ హెర్ట్జ్


       హెర్ట్జ్ 1857 ఫిబ్రవరి 22న జర్మనీ హేంబర్గ్‌లో పుట్టారు. అన్నా ఎలిజబెత్, గుస్టవ్ ఫెర్డినాండ్ హెర్ట్జ్, ఆయన తల్లిదండ్రులు. ఆయన జర్మనీలోని వివిధ నగరాల్లో విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్ అభ్యసించారు. 1880లో బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. 
 
       1883లో కేల్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. 
1885లో కార్ల్‌స్రూహే విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా నియమితులయ్యారు. 
అక్కడ పనిచేస్తూనే విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను 
కనుక్కున్నారు. హెర్ట్జ్ చేసిన ప్రయోగాలు వైర్‌లెస్ టెలిగ్రాఫ్, రేడియో, రాడార్, టెలివిజన్  
ఆవిష్కరణలకు దోహద పడింది. కాంతి తరంగాలు కూడా ఒకరకం విద్యుదయస్కాంత
 తరంగాలని ఆయన కనుక్కున్నారు. 1887లో కాంతి విద్యుత్తు ఫలితం లెక్కగట్టగలిగారు. 
1892లో కాథోడ్ కిరణాలు అతిపల్చటి లోహపు రేకుల ద్వారా చొచ్చుకు పోగలవని తెలుసుకున్నారు.

       
విద్యుదయస్కాంత వికిరణాల పౌనఃపున్యం S.I. ప్రమాణంగా ఆయన గౌరవార్థం 
హెర్ట్జ్ పేరే పెట్టారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఈయన చిత్రంతో తపాలా బిళ్లలను విడుదల 
చేసాయి. ఆయన 1894 జనవరి 1న తన 36వ ఏట జర్మనీలోని బాన్ నగరంలో కన్నుమూశారు.