గెలీలియో



              



గెలీలియో 1564 ఫిబ్రవరి 15న ఇటలీలోని పీసా నగరంలో విన్సెంజో గెలీలియో, గైలియా దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం వల్లెంబ్రోసాలోని ఓ మఠంలో సాగింది. అనంతరం గణితశాస్త్ర అధ్యయనం కోసం పీసా విశ్వవిద్యాలయంలో చేరారు.    
 
 ¤ 1589లో పీసాలో గణిత శాస్త్ర అధిపతిగా నియమితుడయ్యాడు. 1592లో రేఖాగణితం,
 యాంత్రిక శాస్త్రం, ఖగోళశాస్త్రాలను బోధించడానికి పాడువా విశ్వవిద్యాలయంలో చేరారు. 
1593లో వ్యాకోచం చెందే గాలి వలన పనిచేసే ఉష్ణమాపకం కనుక్కున్నారు.

 ¤ 1595 - 98 మధ్యకాలంలో సైనికులకు పనికివచ్చే రేఖాగణిత కంపాస్‌ని కనుక్కుని,

 అభివృద్ధిపరిచారు. 1609లో ఓ టెలిస్కోప్ కనుక్కున్నారు. అది పనిచేసే విధానం పెద్దలకు 
వివరించారు.

 ¤ 1610 జనవరిలో ఆయన గురుగ్రహం ఉపగ్రహాలను గుర్తించారు. అదే ఏడాది 

శుక్రగ్రహం కళలు (Phases) పరిశీలించారు. ఈ పరిశోధనలు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని
 బలపరిచాయి. పై నుంచి కిందికి పడే వస్తువులు వాటి ద్రవ్యరాశి లేదా పరిమాణంతో నిమిత్తం
 లేకుండా శూన్యంలో ఒకే సమ త్వరణంతో ప్రయాణిస్తాయని తెలిపారు.

 ¤ లఘు లోలకాల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటి ఫలితాల ఆధారంగానే

 క్రిస్టియన్ హైగేన్స్ లోలక గడియారాలను తయారుచేయగలిగారు.

 ¤    
భూకేంద్రక, సూర్యకేంద్రక సిద్ధాంతాలకు సంబంధించి గెలీలియో రాసిన 'డైలాగ్' 
అనే పుస్తకం క్రైస్తవ చర్చి ఆగ్రహానికి కారణమైంది. ఆయన్ని ఫ్లోరెన్స్ నగరంలో 
గృహనిర్బంధంలో ఉంచింది. అక్కడే 1642 జనవరి 8న తన 77వ ఏట గెలీలియో చనిపోయారు.

        
గెలీలియోని ఆధునిక ఖగోళ శాస్త్ర పరిశోధనల పితామహుడిగా పిలుస్తారు.
 2009లో గెలీలియో టెలిస్కోప్ ఆవిష్కరించి 400 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
 ఓ అంతర్జాతీయ స్మారక నాణెం విడుదల చేశారు.


మరికొందరు మహామహులు 

స‌ర్ సి.వి రామ‌న్

సర్ హంఫ్రీడేవి

శ్రీనివాస రామానుజన్

లైనస్ కార్ల్ పౌలింగ్

మెండలీవ్

నీల్స్ బోర్

జాకోబస్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్

హెన్రిక్ రుడాల్ఫ్ హెర్ట్జ్

విలియం గేస్కోయిన్

మైఖేల్ ఫారడే

నికోలా టెస్లా

థామస్ ఆల్వా ఎడిసన్

జొహెనెస్ కెప్లర్

క్రిస్టియన్ హైగెన్స్

ఐజక్ న్యూటన్