థామస్ ఆల్వా ఎడిసన్



        
థామస్ ఆల్వా ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11న
 అమెరికాలోని మిలాన్‌లో జన్మించారు. అతడి తల్లిదండ్రులు నాన్సీ మాథ్యూస్, సామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్. ఆయన అధికారిక పాఠశాల చదువు కేవలం 3 నెలలు మాత్రమే సాగింది.
 
 అతడి తల్లే గురువై విద్యాబోధన చేశారు. 'స్కూల్ ఆఫ్ నేచురల్ ఫిలాసఫి', 
'కూపర్ యూనియన్' అతడి విద్యాభ్యాసానికి సహకరించాయి.        
ఎడిసన్ గ్రాండ్ ట్రంక్ రైల్వేలో వార్తాబాలుడిగా ఉండేవాడు. తన ఖాళీ సమయాల్లో రైలు 
పెట్టెలోనే ప్రయోగాలు చేసేవాడు. ఈయన చేసిన ఓ ప్రయోగం వల్ల ఓ రైలు బోగీ ప్రమాదానికి 
గురికావడంతో తన ఉద్యోగం పోగొట్టుకున్నారు. క్వాడ్రుప్లెక్స్ టెలిగ్రాఫ్ కనుక్కుని, దాని 
మేథోహక్కులను 1874లో వెస్ట్రన్ యూనియన్ సంస్థకు విక్రయించారు. వచ్చిన డబ్బుతో 
న్యూజెర్సీలోని మెన్లో పార్కులో ఓ పారిశ్రామిక పరిశోధనాశాల ప్రారంభించారు. 
1877లో గ్రామఫోన్(ఫోనోగ్రాఫ్), అతి చవకయిన ఫిలమెంటు విద్యుద్దీపంకనుక్కున్నారు. 
1877 - 78లో టెలిఫోన్‌లలో ఉపయోగించే కార్బన్ మైక్రోఫోన్, శ్రీ కిరణాలతో ఫొటోలు తీసే 
ఫ్లోరోస్కోప్ అనే పరికరం కనుక్కున్నారు. 1891లో కైనెటోస్కోప్ అనే పరికరం ఆవిష్కరించారు. 
1912లో మొదటిసారిగా మూకీ చిత్రాల స్థానే టాకీ చిత్రాలు నిర్మించారు. ఈయన ఉష్ణ 
అయానిక ఉద్గారం కనుక్కున్నారు. దానికి 'ఎడిసన్ ఫలితం' అని పేరు. ఈయన తన 
జీవితకాలంలో 1093 పరిశోధనలకు పేటెంట్ హక్కులు పొందారు.

        
అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ ఈయన పుట్టిన తేది ఫిబ్రవరి 11ని జాతీయ 
పరిశోధకుల రోజుగా ప్రకటించింది. ఈయన 1931 అక్టోబరు 18న, తన 84వ ఏట న్యూజెర్సీలోని
 వెస్ట్ ఆరెంజ్‌లో మృతి చెందారు.