సర్ హంఫ్రీడేవి

సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ (ఇంగ్లండ్)లో రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు.
¤ పెంజన్స్ గ్రామర్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి 1793లో ట్రూరో వెళ్లాడు.
¤ 1798లో బ్రిష్టల్‌లోని న్యూమేటిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరాడు. అక్కడ వాయువులపై ప్రయోగాలు చేశాడు.
 
¤ 1801లో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. 
1804లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1810లో 'ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్
 సైన్సెస్‌'కి విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1820లో రాయల్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.

¤ 1807లో డేవిడ్ హంఫ్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి పొటాషియం తయారుచేశాడు.
 సోడియం హైడ్రాక్సైడ్ నుంచి సోడియంను వేరుచేశాడు.

¤ 1808లో కాల్షియం మూలకాన్ని కనుగొన్నాడు. మెగ్నీషియం, బోరాన్, బేరియం మూలకాలను

 కూడా గుర్తించాడు. బొగ్గు గనుల్లో ఉపయోగించే రక్షక దీపాన్ని కనుగొన్నాడు. 1810లో క్లోరిన్
 వాయువుకి ఆ పేరును ప్రతిపాదించాడు.

¤ చంద్రునిపై ఒక బిలానికి డేవీ అనే పేరు పెట్టారు. నెపోలియన్ బోనపార్టీ నుంచి ఒక పతకాన్ని
 పొందాడు.

¤ 1819లో హంఫ్రీ డేవీకి 'సర్' బిరుదు ఇచ్చి గౌరవించారు.

¤ 1829 మే 29న 50వ ఏట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మరణించాడు.