శ్రీనివాస రామానుజన్


        రామానుజన్ డిసెంబరు 22, 1887లో తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవారు. తల్లి కోమలటమ్మళ్ గృహిణి.
¤ రామానుజన్ విద్యాభ్యాసం 1892 అక్టోబర్ 1న కాంచీపురంలోని చిన్న పాఠశాలలో ప్రారంభమైంది. తర్వాత కంగయాన్ పాఠశాలలో చేరాడు. అక్కడ మంచి ప్రతిభ చూపించాడు.
 
¤ 1897 నవంబర్‌లో పది సంవత్సరాల వయసులోనే ఆంగ్లం, తమిళం, భూగోళశాస్త్రం, గణితం 
అంశాలతో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. మంచి మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడు

¤ 1898లో హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు. అక్కడే మొదటిసారిగా గణితశాస్త్రం
 (formal mathematics) తో పరిచయం ఏర్పడింది.

¤ 1909 జులై 14న రామానుజన్‌కు జానకీ అమ్మళ్‌తో వివాహమైంది. పెళ్లి తర్వాత 
ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.¤ అప్పట్లో రామస్వామి అనే డిప్యూటీ కలెక్టర్ ఉండేవాడు.
 ఆయన కొత్తగా ఒక గణిత సమాజాన్ని ఏర్పాటు చేశాడు. రామానుజన్ రామస్వామిని కలిశాడు.
 ఆయన ఆఫీస్‌లో చిన్న ఉద్యోగం ఇవ్వమని కోరాడు. గణితం మీద రాసుకున్న 
తన నోటుపుస్తకాలను ఆయనకు చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనల్లో 
రామానుజన్ గురించి ఇలా రాసుకున్నాడు. 'ఆ నోటుపుస్తకాల్లోని అపారమైన గణిత 
విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంతటి గొప్ప విజ్ఞానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో 
ఉద్యోగం ఇచ్చి అవమానపరచలేను'.

¤ నారాయణ అయ్యర్, రామచంద్రరావు, E.W.మిడిల్‌మాస్ట్ మొదలైనవారు రామానుజన్ 
పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు.

¤ స్నేహితుల సహకారంతో రామానుజన్ మార్చి 17, 1914లో ఇంగ్లండ్‌కు ప్రయాణమయ్యాడు. 
అక్కడ G.H.హర్డీతో కలిసి దాదాపు 3900 సూత్రాలను కనుగొన్నారు. అందులో చాలావరకు
 సమీకరణాలకు సంబంధించినవి.

¤ రామానుజన్ దాదాపు 5 సంవత్సరాలు కేంబ్రిడ్జిలో ప్రపంచంలోని ప్రముఖ గణితశాస్త్రవేత్తలతో 
కలిసి పనిచేసారు.

¤ లండన్ గణిత సమాజంవారి జర్నల్‌లో ప్రచురితమైన 'కాంపోజిట్ నంబర్' పరిశోధనకు 
ఆయనకు మార్చి 1916లో B.A.డిగ్రీ ప్రదానం చేశారు. లండన్ గణిత సమాజం, రాయల్ 
సమాజంలో సభ్యత్వం లభించింది.

¤ శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల
 లాంటి ఆధునిక విషయాల్లో ఉపయోగపడుతున్నాయి.

¤ రామానుజన్ చివరి దశలో 'మాక్-తీటా ఫంక్షన్స్'(mock theta functions) పై చేసిన 
పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఇప్పటికీ 
అపరిష్కృతంగానే ఉండటం విశేషం.

¤ అనారోగ్యం కారణంగా 1919లో భారతదేశం తిరిగి వచ్చారు. 1920 ఏప్రిల్ 26న, 
32 సంవత్సరాలకే రామానుజన్ మరణించారు.

¤ రామానుజన్ సొంత రాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్రవాసిగా ఆయన సాధించిన 
విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22ను రాష్ట్ర సాంకేతిక 
దినోత్సవంగా ప్రకటించింది.

¤ భారత ప్రభుత్వం 1962లో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యశాస్త్రంలో
 ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాళ బిళ్లను విడుదల చేసింది.